Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 08, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ధనలాభం

Today Horoscope In Telugu 08 April 2021: ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2021, 07:53 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 08, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ధనలాభం

Horoscope Today 08 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 08వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఈ రోజు మీ జీవితంలో దాదాపు ప్రతి విషయంలో మార్పు జరగబోతోంది. మీరు ఉద్యోగం మారేందుకు యోచిస్తున్నారు. కొత్త ఇంటికి మారాలని అంతా సిద్ధం చేసుకుంటారు. ఈ రోజు మీ పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి.

Also Read: Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ

వృషభ రాశి
ఈ రోజు మీరు చాలా ఓపికగా ఉంటారు. రాబోయే ఏ ప్రాజెక్ట్‌లోనైనా మీ సహచరులు మీతో సహకరిస్తారు. ఇతరులతో మీ పనిని వేగవంతం చేయడంలో ధ్యానం, మానసిక ప్రశాంతత మీకు సహాయపడుతుంది. మీరు మీ కుటుంబంతో ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా ఉండదు. రుణ యత్నాలు మొదలుపెడతారు. ఉద్యోగులకు ఒత్తిడి అధికం కానుంది.

మిథున రాశి
మిథున రాశి వారు ఈ రోజు తమ కుటుంబంతో చాలా బిజీగా ఉంటారు. దీని కోసం మీ పనిని వాయిదా వేసుకుంటారు. కొన్ని వస్తువులు కొనుగోలు చేయడానికి ఇది తగిన సమయం. మీరు పనిచేసే చోటు నుండి శుభవార్త అందుతుంది. వ్యాపారులకు అంతగా కలిసిరాదు. పనులలో జాప్యం తలెత్తుతుంది. 

కర్కాటక రాశి 
మీరు స్నేహితులతో తీరిక లేకుండా గడుపుతారు. మీరు కడుపు సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కనుక ఈ రోజు ఇంట్లో తినడం మంచిది. మీ మనస్సు మీ కెరీర్‌పై దృష్టి పెడుతుంది. అయితే సృజనాత్మకతకు సంబంధించిన కెరీర్‌పై ఆసక్తి చూపుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామిని అభినందించడం మర్చిపోవద్దు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగావకాశాలలో శుభవార్త అందుతుంది. 

Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!

సింహ రాశి
చాలా కాలం నుంచి ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకోసం మీరు నాయకత్వం వహిస్తున్న ప్రాజెక్టులో కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. ఈ రోజు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. నేడు ఆకస్మిక ధనలాభం, వాహనయోగం గోచరిస్తున్నాయి. చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు.

కన్య రాశి
ఈ రోజు ఆర్థిక విషయానికి వస్తే మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఏ సందేహం లేకుండా నిర్ణయం తీసుకోండి. మతపరమైన ప్రయాణాల వైపు మొగ్గు చూపుతారు. ఆర్థిక సమస్యల కారణంగా చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. ప్రయాణాల కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. తద్వారా కొత్తగా రుణ యత్నాలు ప్రారంభిస్తారు. ఉద్యోగుల పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. 

తులా రాశి
ఈ రోజు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదురవుతాయి. కనుక బయటకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వ్యాపార రంగంలో లాభాలను ఆర్జిస్తారు. విద్యార్థులకు ముఖ్యమైన ప్రాజెక్ట్ పరీక్ష రోజు దగ్గరకు వస్తే, ఆ రోజు మాత్రమే దానిపై దృష్టి పెట్టడం మంచిది. ఖర్చులు పెరుగుతాయి. అనుకోని కారణాలతో ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.

వృశ్చిక రాశి
ఈ రోజు కొత్త పనులు చేపట్టడానికి  మంచి రోజు. మీ యజమాని మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. మీరు మీ జీవిత భాగస్వామితో కొంత ఇబ్బంది పడుతుంటే, అది ఈ రోజు పరిష్కారం అవుతుంది. ఇల్లు లేదా కారు లాంటి వాటికి నేడు రుణం తీసుకుంటారు. అదే సమయంలో మీ భవిష్యత్తును ప్లాన్ చేసుకోండి. ఉద్యోగాలకు శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది.

Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా

ధనుస్సు రాశి
ఈ రోజు మీకు అందరి ఆశీర్వాదాలు ఉంటాయి. మీ వృత్తి పరమైన పనుల్లో మరింత మెరుగ్గా రాణిస్తారు. మీరు పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే, ఈ రోజు అనుకూలమైన సమయం. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబసభ్యుల మధ్య వివాదాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 

మకర రాశి
మీరు పనిలో ఉన్నవారి నుండి అవకాశాలు పొందుతారు. మీకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. చుట్టుపక్కల ఉన్న వారి నుంచి గౌరవం పొందుతారు. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. చాలా కాలం తరువాత కొందరు మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి.

కుంభ రాశి
ఈరోజు కాస్త నెమ్మదిగా రోజును ప్రారంభిస్తారు. రోజు చివరివరకూ ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తారు. నేటి రాత్రి మీకు చాలా ముఖ్యమైనది. మీరు మీ వ్యాపారాన్ని పునరుద్ధరించాలనుకుంటే, అందుకు నేడు మంచి రోజు. ఒంటరిగా కొంత సమయం గడపండి, దాని ద్వారా కొన్ని ఆలోచనలతో మీలో మార్పు వస్తుంది. ప్రయాణాల కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారులకు సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. 

Also Read: COVID-19 Vaccination: కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇది చదవండి

మీన రాశి
పని పరంగా కొత్త విషయాలు మీకు ఎదురుకానున్నాయి. మీరు ఏమాత్రం సంకోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే మంచిది. విద్యార్థులు కొత్తగా కోర్సులలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. కెరీర్‌ను ఎంచుకునేందుకు ఆలోచిస్తారు. మీ ఉద్యోగాన్ని మారాలనుకుంటే, ఈ రోజు అందుకు సరైన సమయం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకర్యాలకు ఆహ్వానాలు అందుతాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News