Lucky Birds: ఈ పక్షులు ఇంటికొస్తే అత్యంత శుభ సూచకం, వద్దంటే డబ్బు వచ్చి పడుతుంది

Lucky Birds: చాలామందికి ఇళ్లలో పక్షులు, జంతువులు పెంచుకోవడం అలవాటుగా ఉంటుంది. ఇటీవలి కాలంలో పక్షుల పెంపకం అధికమౌతోంది. ఈ పక్షులు పెంపకం వెనుక కూడా కొందరికి కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 1, 2023, 07:52 PM IST
Lucky Birds: ఈ పక్షులు ఇంటికొస్తే అత్యంత శుభ సూచకం, వద్దంటే డబ్బు వచ్చి పడుతుంది

Lucky Birds: హిందూమతం ప్రకారం కూడా పశు పక్ష్యాదులకు విశేష ప్రాధాన్యత, మహత్యముంటుంది. అదే సమయంలో ఏయే పక్షుల్ని పెంచుకోవాలి, ఏవి పెంచకూడదనే విషయంపై కొన్ని నమ్మకాలు, విశ్వాసాలున్నాయి. కొందరైతే కొన్ని పక్షుల్ని పూజిస్తుంటారు కూడా. 

హిందూమతంలో చాలా విశ్వాసాలు, నమ్మకాలుంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం. దేవీ దేవతల్ని ఎలా పూజిస్తారో అదే విధంగా పశు పక్ష్యాదుల్ని, చెట్లు చేమల్ని పూజిస్తుంటారు. కొన్ని పశు పక్ష్యాదులను అత్యంత శుభ సూచకంగా భావిస్తారు. అందుకే అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం, పునస్కారాలు చేయడం కన్పిస్తుంది. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి. కేవలం జ్యోతిష్యశాస్త్రం ప్రకారమే కాకుండా వాస్తుశాస్త్రంలో కూడా వీటికి ప్రాధాన్యత ఉంది. కొన్ని పక్షులకు శుభ అశుభ సంకేతాలున్నాయి. అంటే కొన్ని పక్షులంటే శుభానికి సంకేతమని, కొన్ని పక్షులంటే అపశకునమనే నమ్మకాలుంటాయి. కొన్ని పక్షులకు సంబంధించి కొన్ని సంకేతాలు, లక్షణాలుంటాయి. అదే సమయంలో కొన్ని పక్షులు ఇంటికి రావడం అత్యం శుభ సూచకంగా కూడా భావిస్తారు.

ఇంటికి రామ చిలుకలు వస్తే శుభ సూచకంగా భావిస్తారు. వాస్తు ప్రకారం ఇంటికి ఆకశ్మికంగా రామ చిలుక వస్తే అత్యంత శుభంగా పరిగణిస్తారు. రామ చిలుకలు రావడమంటే ధనలాభం కలుగుతుందని అర్ధం. 

హిందూ వాస్తుశాస్త్రం ప్రకారం గుడ్లగూబ కూడా శుభసూచకమని అర్ధం. ఎందుకంటే గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు. ఒకవేళ ఏదైనా ఇంటికి గుడ్లగూబ వచ్చివనా లేక ఇంటి పరిసరాల్లో గుడ్లగూబ కన్పించినా ఆ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని అర్ధం. గుడ్లగూబ వచ్చిందంటే ఇంట్లో ధనం సుఖ శాంతులు కలుగుతాయి.

ఇంట్లో పిచ్చుకలు ఇళ్లు కట్టుకుంటే చాలా శుభప్రదమని అర్ధం. వాస్తు ప్రకారం ఇంట్లో పిచ్చుకల గూడు ఉందంటే ఆ ఇంట్లో మంచి జరగనుందని సంకేతమట. అంతేకాకుండా ఆ ఇంట్లో సుఖ సౌభాగ్యం, సమృద్ధి ప్రాప్తిస్తాయి. ఇంట్లో పిచ్చుక గూడు కట్టుకుందంటే మీ ఇంట్లో అంతులేని ఆనందం కలగనుందని అర్ధం.

ఆఖరికి ఇంటికి కాకులు రావడం కూడా మంచి శకునంగానే భావిస్తారు. ఎవరైనా ఇంటికి కాకులు వచ్చినా లేదా కాకి అరుపులు అదే పనిగా విన్పించినా ఆ ఇంటికి అతిధులు లేదా బంధువులు వస్తున్నారని అర్ధం.

ఇక ఎవరైనా ఇంటికి నీలకంఠ పక్షి రావడమంటే చాలా చాలా శుభప్రదం. ఎందుకంటే నీలకంఠ పక్షి అనేది చాలా అరుదుగా కన్పిస్తుంది. మీ ఇంటిపై ఈ పక్షి వస్తే ఇక మీకు అదృష్టం తన్నుకొచ్చినట్టే అర్ధం. ఇంకా సులభంగా చెప్పాలంటే పెద్దఎత్తున లాటరీ తగలనుంది. అదే నీలకంఠ పక్షి దసరా రోజున ఇంటికి వస్తే మాత్రం ధన సంపదలు, అదృష్టం, సౌభాగ్యం వద్దంటే వస్తుంది.

Also read: Mercury Transit 2023: ఏడాది తరువాత ఈ మూడు రాశులకు పట్టిందల్లా బంగారమేనట, అంతులేని ధనలాభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News