Mangal Gochar 2023 Dates: కొత్త ఏడాది ప్రారంభం కాగానే ఈ సంవత్సరమైనా తమ జీవితం బాగుండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. గ్రహాలు మరియు రాశుల మార్పు మీ జీవితంలో సంతోషాన్ని మరియు దుఃఖాన్ని ఇస్తుంది. ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. 2023లో మార్స్ గ్రహం తన స్థానాన్ని ఏడు సార్లు మార్చుకోనుంది. గ్రహాల కమాండర్ అయిన మార్స్ భూమి, భవనం, యోధుడు యొక్క కారకుడిగా భావిస్తారు. కుజుడిని క్రూర గ్రహం, రెడ్ ఫ్లానెట్ అని పిలుస్తారు. కుజుడు మకరం మరియు మీనరాశిలో ఉంటే మంచి ఫలితాలను ఇస్తాడు. అంగారకుడి సంచారం కొన్ని రాశుల వారికి ఏడాదంతా సంపదను ఇస్తుంది.
అంగారక సంచారం ఈ రాశులకు శుభప్రదం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మేషం మరియు వృశ్చికం అనే రెండు రాశుల వారికి అధిపతి అంగారకుడు. వీరికి కుజుడు ఎప్పుడు అశుభఫలితాలను ఇవ్వడు. మీ జాతకంలో మార్స్ శుభస్థానంలో ఉంటే వారికి దేనికీ లోటు ఉండదు. ఒకవేళ అశుభస్థానంలో ఉంటే వారు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. ఈ సంవత్సరం అంగారక గ్రహం ఎప్పుడు, ఎన్ని సార్లు తన రాశిని మార్చనుందో తెలుసుకుందాం.
2023లో మార్స్ సంచార టైమింగ్స్
మార్చి 13, 2023, సోమవారం- ఉదయం 05.33 గంటలకు వృషభరాశిని వదిలి మిథునరాశిలోకి ప్రవేశిస్తుంది.
మే 10, 2023, బుధవారం - మధ్యాహ్నం 02.13 గంటలకు మిథునరాశిని వదిలి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది.
జూలై 01, 2023, శనివారము - తెల్లవారుజామున 02.38 గంటలకు కర్కాటక రాశి నుండి బయటకు వెళ్లి సింహరాశిలో కూర్చుంటుంది.
ఆగస్ట్ 18, 2023, శుక్రవారం - సాయంత్రం 04:13 గంటలకు సింహరాశి నుండి కన్యారాశిలోకి ప్రవేశిస్తుంది.
అక్టోబర్ 03, 2023, మంగళవారం - సాయంత్రం 06.17 గంటలకు కన్యారాశి నుండి తులారాశిలోకి మారుతుంది.
16 నవంబర్ 2023, గురువారం – ఉదయం 11.04 గంటలకు తులారాశి నుండి బయలుదేరి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుంది.
డిసెంబర్ 28, 2023, బుధవారం - మధ్యాహ్నం 12.37 గంటలకు వృశ్చికం నుండి ధనుస్సు రాశికి ప్రయాణిస్తుంది.
మీ జాతకంలో కుజుడు బలపడాలంటే..
మీరు మీ జాతకంలో కుజుడు యొక్క స్థానాన్ని బలోపేతం చేయాలనుకుంటే.. మీ చేతికి ఎరుపు రంగు దారాన్ని కట్టుకోండి. అంగారకుడి అశుభ ప్రభావం తగ్గాలంటే.. మంగళవారం నాడు హనుమాన్ ఆలయానికి వెళ్లి బూందీని నైవేద్యంగా పెట్టండి.
Also Read: Guru Mahadasha 2023: మీ జాతకంలో గురు మహాదశ ఉందా.. అయితే మీరు త్వరలో ధనవంతులవ్వడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook