Lunar Eclipse 2024: మొదటి చంద్రగ్రహణం గర్భిణులు ఈ పనులు అస్సలు చేయకూడదు..

Lunar Eclipse 2024:  సాధారణంగా గ్రహణాలు ఏర్పడటం అశుభంగా హిందూ మతంలో పరిగణిస్తారు. అయితే, రేపు పౌర్ణమినాడే చంద్రగ్రహణం ఏర్పడనుంది. అంటే చంద్రుడు, రాహువు కలవనున్నారు.

Written by - Renuka Godugu | Last Updated : Mar 24, 2024, 05:12 PM IST
Lunar Eclipse 2024: మొదటి చంద్రగ్రహణం గర్భిణులు ఈ పనులు అస్సలు చేయకూడదు..

Lunar Eclipse 2024:  సాధారణంగా గ్రహణాలు ఏర్పడటం అశుభంగా హిందూ మతంలో పరిగణిస్తారు. అయితే, రేపు పౌర్ణమినాడే చంద్రగ్రహణం ఏర్పడనుంది. అంటే చంద్రుడు, రాహువు కలవనున్నారు. రేపు చంద్రగ్రహణ రేపు 2024 మార్చి 25న ఏర్పడనుంది. ఈసమయంలో గర్భిణులు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. ఆ పనులు ఏంటో తెలుసుకుందాం.

చంద్రగ్రహణ సమయంలో గర్భిణులు తమ ఇష్ట దైవాన్ని ధ్యానించుకోవాలి. అంతేకాదు పవిత్రమైన మత గ్రంథాలను చదవాలి. అంటే వేదాలు వంటివి గర్భిణులు గ్రహణం సమయంలో చదువుకోవాలి. దైవ సంబంధిత మంత్రాలు, పాఠాలను ఇంట్లో పెట్టుకుని వినాలి. అంతేకాదు, చంద్రగ్రహణం తర్వాత స్నాన దానాలు చేయాలి. ముఖ్యంగా ఈరోజు గర్భిణులు మాత్రమే కాదు సామాన్యులు కూడా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అంతేకాదు చంద్రగ్రహణ సమయంలో ప్రాణాయామం, యోగా వంటివి గర్భిణులు చేసుకోవచ్చు. ఈరోజు బయటకు వెళ్లకుండా మీ కుటుంబ సభ్యులతో సమయం గడపండి.

గర్భిణులు  ఈ పనులు చేయకూడదు..
గర్భిణులు ఈ రోజు ఏ కొత్త పనులు ఏవి చేయకూడదు. ఈరోజు మద్యం, మాంసాం తినకూడదు. చంద్రగ్రహణం సమయంలో జుట్టు, గోర్లు కత్తిరించకూడదు. ముఖ్యంగా ఈరోజు దూర ప్రయాణాలు చేయకూడదు. అయితే, ఈసారి దేవాళయాలను మూసివేయరు. యథావిధిగా కొనసాగుతాయి. ఎందుకంటే రేపటి చంద్రగ్రహణ భారత్ లో కనిపించడదు. సూతకం కూడా చెల్లదు. సాధారణంగా చంద్రగ్రహణం చంద్రుడు భూమి నీడలోకి వెల్లినప్పుడు చీకటి ఏర్పడుతుంది. ఈసారి చంద్రగ్రహణ సమయం నాలుగు గంటలు 39 నిమిషాలు.

ఇదీ చదవండి:  మీ ఇంట్లో తులసిమొక్క ఉందా? ఈ నియమం తప్పనిసరిగా తెలుసుకోండి..

అయితే, సాధారణ ప్రజలు కూడా చంద్రగ్రహణం ముందు ఆ తర్వాత తప్పకుండా స్నానం చేయాలి. ముఖ్యంగా గ్రహణం సమయంలో ఏ ఆహారం తినకూడదు. ఎందుకంటే ఈ సమయంలో ఏది తిన్నా అది నెగిటివ్ గా పనిచేస్తుంది. గర్భిణులు గ్రహణం సమయంలో పదునైన వస్తువులను పట్టుకోకూడదు. ఈ సమయంలో నిద్రపోకుండా ఉండాలి. ఇతరులతో వాగ్వాదానికి దిగకూడదు. ఎందుకంటే ఈ గ్రహణం సమయంలో మనస్సు కాస్త ఒత్తిడిగా అనిపిస్తుంది. అంతేకాదు గ్రహణం సమయంలో ఏం వండకూడదు. అలా వండిన ఆహారం నెగిటివ్ ఎనర్జీతో కూడి ఉంటుంది.

ఇదీ చదవండి:  ఈరోజే శనిత్రయోదశి.. ప్రదోషకాలంలో ఈ ఒక్కపని చేశారంటే మీరు కోటీశ్వరులే..

చంద్రగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడలేం. ఎందుకంటే ఈసారి భారత్‌ లో కనిపించదు. కానీ, కొన్ని లైవ్ స్ట్రీముల్లో, బ్రాడ్ కాస్టింగ్స్ లో ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు. చంద్రగ్రహణం నెదర్లాండ్, నార్వే, ఐర్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, బెల్జియం, స్పెయిన్, యూఎస్, ఇంగ్లాడ దేశాల్లో కనిపించనుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News