Characteristics Of Purva-Bhadrapada Nakshatra: ఉత్తర భాద్రపాద నక్షత్రంలో జన్మించిన వ్యక్తులంతా ఎంతో నిజాయితీ, ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు స్నేహితుల పట్ల వారి స్నేహం పట్ల ఎంతో నమ్మకంతో కలిగి ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారంతా తమ స్నేహితులకు సహాయం చేసేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అందుకే స్నేహితుల సహాయంతో వీరికి ఏ పనుల్లోనైనా సులభంగా విజయాలు కలుగుతాయి. అయితే ఈ నక్షత్రాన్ని శని దేవుడు పాలిస్తాడు. అందుకే ఈ నక్షత్రంలో పుట్టిన వారంతా ఎంతో తెలివితేటలతో ఉంటారు. అంతేకాకుండా ఎంత కఠినమైన విద్య నైనా వీరు సులభంగా అభ్యసిస్తారు.
ఉత్తరభాద్ర పాద నక్షత్రంలో జన్మించిన వారంతా వారి తెలివితేటలతో పాటు స్ఫూర్తితో జీవితంలో ముందుకు వెళ్తారు. అంతేకాకుండా ఎలాంటి పరిస్థితులను అయినా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. వీరు వ్యక్తిగత జీవితంలో దయను, బాగోద్వేగాన్ని కలిగి ఉంటారు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం వీరి లోపల ఉన్న అభిప్రాయాలను చెప్పేందుకు కష్టపడుతూ ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారంతా సమయాన్ని బట్టి మారుతూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో స్వార్థపూరితంగా కూడా వ్యవహరిస్తారు. దీంతోపాటు బాధ్యత రహితంగా కూడా ఉంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెడుతున్నారు.
ఇది కూడా చదవండి : Loan Application For Defaulters: లోన్ ఎగ్గొట్టిన వాళ్లు మళ్లీ లోన్ కోసం అప్లై చేస్తే వస్తుందా ?
ఉత్తరాభాద్రపద నక్షత్రంలో జన్మించిన పురుషుల గురించి మాట్లాడుతున్నట్లయితే.. వీరు ఇతరుల పట్ల వివక్షను చూపేందుకు అతిగా ఇష్టపడరు. అంతేకాకుండా ఎవరి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అందరి మంచి కోసమే సమాజంలో పనిచేస్తారు. మహిళల విషయానికొస్తే.. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీ సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం. ఈ నక్షత్రంలో జన్మించిన ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా వీరు ఎలాంటి పనులు చేసినా సులభంగా ఆర్థికంగా బలపడతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
విద్య వీరికి ప్రత్యేకమైనది ఏమీ కాదు:
ఉత్తరాభాద్రపద నక్షత్రంలో జన్మించిన వారి చదువు విశేషమేమీ కాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వారికి అన్ని విషయాలపై జ్ఞానం ఉండడమే కాకుండా.. సులభంగా అన్ని విషయాలను తెలుసుకుంటారు. ఇక వ్యాపారాలు చేసే వారి విషయానికొస్తే అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. వీరు తప్పకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో భాగస్వాముల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. లేకపోతే ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ నక్షత్రంలో జన్మించిన ఉపాధ్యాయులు, రచయితలు, తత్వవేత్తలు ఆర్థికంగా స్వయం సమృద్ధిని కలిగి ఉంటారు.
ఇది కూడా చదవండి : Loan Application For Defaulters: లోన్ ఎగ్గొట్టిన వాళ్లు మళ్లీ లోన్ కోసం అప్లై చేస్తే వస్తుందా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి