Rahu Transit 2024: ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి రాహువు.. ఈ రాశులవారికి విపరీతమైన డబ్బే..డబ్బు!

Rahu Transit into Uttarabhadrapada Nakshatra: ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి రాహువు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Sep 6, 2024, 12:27 PM IST
Rahu Transit 2024: ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి రాహువు.. ఈ రాశులవారికి విపరీతమైన డబ్బే..డబ్బు!

 

Rahu Transit into Uttarabhadrapada Nakshatra: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని, రాహువు గ్రహాలు అత్యంత నెమ్మదిగా ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేస్తాయి. ఇదిలా ఉండే రాహువు గ్రహం రాశిలోకి ప్రవేశించడానికైనా దాదాపు 18 నెల పాటు సమయం పడుతుంది. దీని ప్రభావం అన్ని రాశులవారిపై పడుతుంది. ప్రస్తుతం రాహువు గ్రహం ఉత్తరాభాద్రపద నక్షత్రంలో సంచార దశలో ఉంది. అయితే ఈ నక్షత్రాన్ని శని పరిపాలిస్తుంది. కాబట్టి రాహువు ఆ నక్షత్రంలోకి సంచారం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. రాహువు ఆగష్టు 16వ తేదీన ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించింది. ఈ గ్రహం డిసెంబర్ 2 వరకు అదే రాశిలో సంచార దశలో ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా డిసెంబర్‌ వరకు కొన్ని రాశులవారు అదృష్టాన్ని పొంది.. ఊహించని ధన లాభాలు పొందుతారు. 

ఈ రాశులవారికి బోలెడు లాభాలు:
కుంభ రాశి: 

రాహువు సంచారం చేయడం వల్ల కుంభ రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి అనుకున్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి. అలాగే డబ్బు సంబంధిత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. వీరికి ఎల్లప్పుడు రాహువు అనుగ్రహం లభించి, నిలిపోయిన డబ్బులు కూడా సులభంగా తిరిగి వస్తాయి. అంతేకాకుండా ఆకస్మిక ధన లాభాలు కూడా కలుగుతాయి. అలాగే భౌతిక సంతోషం విపరీతంగా పెరుగుతుంది. దీంతో పాటు కెరీర్‌కి సంబంధించిన జీవితంలో అనుకుని ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు కోర్టు కేసుల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పరిష్కారమవుతాయి. 

మకర రాశి:  
మకర రాశివారికి రాహువు మూడవ స్థానంలో ఉంటుంది. దీని కారణంగా వీరికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే వీరికి పెడింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు కుటుంబ జీవితంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆకస్మిక ధన లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు వృత్తి జీవితంలో వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఎలాంటి రంగాల్లో పనులు చేసినా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి కూడా రెట్టింపు అవుతుంది.

తుల రాశి:
తుల రాశివారికి కూడా రాహువు మార్పుల కారణంగా వీపరీతమైన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు భాహ్య జీవితంలో సంతోషం కూడా పెరుగుతుంది. అలాగే కెరీర్‌ కూడా చాలా బాగుంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు కొన్ని లాభాలు కూడా పొందుతారు. మానసిక ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు ఎలాంటి పనుల్లోనైనా విజయాలు సాధిస్తారు. రుణ బాధలను ఉన్నవారికి ఈ సమయంలో ఉపశమనం కూడా కలుగుతుంది. అంతేకాకుండా సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News