Retrograde Of 3 Planets In Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం..బృహస్పతి గ్రహాన్ని ఆనందం, సంపదకు సూచికగా పరిగణిస్తారు. ఈ గ్రహం సంచారం ప్రభావం వ్యక్తుల జాతాకాల్లో అనుకూల స్థానంలో ఉంటే ఆ వ్యక్తులు ఊహించని లాభాలు పొందుతారు. అయితే ఈ గ్రహం ప్రత్యేక్షంగా సంచారం, తిరోగమనం చేయడం కారణంగా కొన్ని రాశుల వారి జాతకాల్లో ఈ గ్రహం ప్రతికూల స్థానంలో ఉంటే అనే రకాల దుష్ర్ఫభావాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ 4 నుంచి దేవగురు బృహస్పతి 118 రోజుల పాటు తిరోగమన దశలో ఉండబోతున్నాడు.
ఇప్పటికే శని, బుధ గ్రహాలు కూడా సంచార క్రమంలో ఉన్నాయి. అయితే దీని కారణంగా మొత్తం 12 రాశులవారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ 4 నుంచి డిసెంబర్ 31 వరకు బృహస్పతి తిరోగమన దశలోనే ఉంటాడు. దీని కారణంగా వృషభం, ధనుస్సు, కన్య రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
కన్య రాశి:
బృహస్పతి తిరోగమనం కారణంగా కన్య రాశికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మూడు గ్రహాల తిరోగమన కదలిక కారణంగా జీవితంలో పొందలేనంత డబ్బు పొందే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇక వ్యాపారాలు చేసేవారికి 118 రోజుల పాటు కీలకమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
వృషభ రాశి:
బృహస్పతి, శని, బుధ గ్రహాల తిరోగమనం కారణంగా వృషభ రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అంతేకాకుండా జీవితంలో కూడా చాలా రకాల మార్పలు వస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు పెరుగుతాయి. పూర్వీకుల ఆస్తిలో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆశించింన లాభాలు కూడా పొందుతారు.
ధనుస్సు రాశి:
మూడు గ్రహాల తిరోగమనం కారణంగా ఈ రాశి వారి జీవితాల్లో చాలా రకాల మార్పులు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో కూడా భారీ లాభాలు పొందుతారు. వీరికి సమాజం పట్ల గౌరవం కూడా పెరుగుతుంది. దీంతో పాటు వీరు విదేశీ పర్యటనలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో ఈ సమయంలో సులభంగా విజయాలు సాధిస్తారు.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి