Sankashti Chaturthi 2023: ఫిబ్రవరి సంకష్ఠి చతుర్థి ఎప్పుడొచ్చింది.. పూజా విధానమేంటో తెలుసా?

Sankashti Chaturthi Febraury 2023: హిందువులు ఎంతో భక్తీ శ్రద్దలతో పూజించే సంకష్టి చతుర్థి ఈ నెలలో ఎప్పుడు జరుపుకుంటారు? దాని పూజా విధానాలు ఏమిటి? అనే వివరాలు మీ కోసం

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 9, 2023, 08:44 PM IST
Sankashti Chaturthi 2023: ఫిబ్రవరి సంకష్ఠి చతుర్థి ఎప్పుడొచ్చింది.. పూజా విధానమేంటో తెలుసా?

Sankashti Chaturthi Puja Vidhanam : హిందువులు ఎంత మంది దేవుళ్లను పూజించినా ప్రధమ పూజ మాత్రం గణపతికే. ఈ క్రమంలోనే సంకష్టి చతుర్థికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుందని చెప్పక తప్పదు. మామూలుగా అన్ని పూజల్లో గణపతికి పూజ చేస్తారు కానీ ఉంది. సంకష్టి చతుర్థి రోజు వినాయకుని పూజించడానికి అంకితం చేస్తారు, ఆ రోజున భక్తులు ఉపవాసం చేసి మరీ పూజలు చేస్తారు. ప్రతి నెలా కృష్ణ పక్షంలో ఈ సంకష్ట చతుర్థి వస్తూ ఉంటుంది ఈ నెలలో కూడా కృష్ణ పక్ష చతుర్థి తిథి నాడు జరుపుకుంటారు. ద్విజప్రియ సంకష్టి చతుర్థి ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి రోజున జరుపుకుంటారు.

ఫాల్గుణ మాసంలో వచ్చే సంకష్ఠి వ్రతాన్ని ద్విజప్రియ సంకష్టి చతుర్థి అంటారు. ఈ రోజున గణేశుడిని ఆచార వ్యవహారాలతో పూజిస్తారు. ఈ రోజు అంటే 9 ఫిబ్రవరి 2023 ద్విజప్రియ సంకష్టి చతుర్థి కావడంతో ఈ రోజు గణేశుడిని పూజించడం ద్వారా మనిషి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ద్విజప్రియ సంకష్టి చతుర్థి రోజున గణేశుడి 32 రూపాలలో ఆరవ రూపాన్ని పూజిస్తారు. ఇక ద్విజప్రియ సంకష్టి చతుర్థి ముహూర్తం ప్రారంభం - ఫిబ్రవరి 09, 2023 ఉదయం 06:23 గంటల నుంచి ఫిబ్రవరి 10, 2023 ఉదయం 07:58 గంటల వరకు ఉంటుంది. 

ద్విజప్రియ సంకష్టి చతుర్థి పూజా విధానం:
సంకష్టి చతుర్థి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించాలి, అంతకంటే ముందే ఇంట్లో ఉన్న దేవుని గూటిని శుభ్రం చేయండి. ఆ తరువాత ముందుగా గణేశుడికి నీటిని సమర్పించాలి, అయితే నీరు సమర్పించే ముందు అందులో నువ్వులు వేయాలి. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట ఆచారాలతో గణేశుని పూజించాలి. నెయ్యితో దీపాన్ని వెలిగించి విగ్రహాన్ని పసుపు పూలతో అలంకరించి, పసుపు తిలకం పూసి మోదకం లేదా స్వీట్లు, నువ్వులు, పండ్లు సమర్పించాలి.

భక్తులు వినాయకునికి ఇష్టమైన దర్భలను కుడా ఈ పూజలు తప్పనిసరిగా సమర్పించాలని చెబుతూ ఉంటారు. భక్తులు ఉపవాసం విరమించే ముందు సాయంత్రం వ్రత కథను చదివి వినాయకుడికి హారతి ఇస్తారు. భారత దేశంలో ఉత్తర సహా దక్షిణ రాష్ట్రాలలో ఈ రోజును మరింత వైభవంగా జరుపుకుంటారు. ద్విజప్రియ సంకష్ట చతుర్థి రోజున గణపతిని పూజించడం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావాలు తొలగిపోయి శాంతిభద్రతలు ఉంటాయని, గణేశుడు ఇంటి నుంచి వచ్చే అన్ని విపత్తులను తొలగిస్తాడని, పూజ చేసిన వ్యక్తుల కోరికలను నెరవేరుస్తాడని చెబుతున్నారు. 

Also Read: Valentine's Day 2023: లవర్స్ డే నాడు ఈ రాశులవారు ప్రపోజ్ చేస్తే వెంటనే ఒప్పేసుకుంటారు... ఇందులో మీరున్నారా?

Also Read: Budh Gochar 2023: బుధాదిత్య యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో విజయం! ఇందులో మీరు ఉన్నారా చూసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News