Shani Vakri 2024 Effect: అష్ట గ్రహాలన్నింటిలోకెల్లా నెమ్మదిగా కదిలే గ్రహం శని. పైగా అందమైన గ్రహం కూడా. ఈ ఫ్లానెట్ రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తుంది. ప్రస్తుతం శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇదే రాశిలో 2025 వరకు ఉంటాడు. అయితే 2023-25 మధ్య కాలంలో శని తన రాశిని మార్చడు కానీ, తన కదలికలను మారుస్తాడు. అయితే ఈ ఏడాది శని తన స్థానాన్ని మార్చుకోనున్నాడు. ప్రస్తుతం కుంభరాశిలో ప్రత్యక్షంగా సంచరిస్తున్న శని.. జూన్ లో అదే రాశిలో తిరోగమనం చేయనున్నాడు. శని గ్రహం యెుక్క ఈ రివర్స్ కదలిక వల్ల ఏయే రాశుల వారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
వృషభం
శని గ్రహం యెుక్క రివర్స్ కదలిక వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పైగా ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు..శనికి మిత్రుడు. దీంతో ఈరాశి వారికి శని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారు ఇదే మంచి సమయం.
మేషం
శని తిరోగమనం మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. వీరి సంపద రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో మీరు ఏ వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన అది భారీ మెుత్తంలో లాభాలను ఇస్తుంది. మీరు లగ్జరీ గా బతుకుతారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తుంది.
మకరం
తిరోగమన శని మకర రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీ వ్యక్తిత్వంతో నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. మీరు కెరీర్ లో మంచి స్థాయికి వెళతారు. వ్యాపారస్తులు లాభపడతారు. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి.
Also Read: Rajyog 2024: త్వరలో పవిత్రమైన రాజయోగం.. ఈ 4 రాశులకు మంచి రోజులు ప్రారంభం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook