Shani Margi 2022: అక్టోబరు 24న గమనంలోకి శని... ఈ 5 రాశులవారు పట్టిందల్లా బంగారమే..!

Shani Margi 2022: శనిదేవుడి రాశిలో మార్పు ప్రతి ఒక్కరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. అక్టోబరు 24న శనిదేవుడు మకరరాశిలో సంచరించనున్నాడు. ఇది ఈ రాశులవారి అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2022, 12:05 PM IST
Shani Margi 2022: అక్టోబరు 24న గమనంలోకి శని... ఈ 5 రాశులవారు పట్టిందల్లా బంగారమే..!

Shani Margi 2022: జ్యోతిష్యశాస్త్రంలో శనిగ్రహాన్ని క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు. శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడి అయినా సరే బిలియనీర్ అవుతాడు. అలాంటి శని ప్రస్తుతం తన సొంత రాశి అయిన మకరరాశిలో తిరోగమనంలో ఉంది. అక్టోబరు 23 తర్వాత శని మార్గంలోకి (Shani Margi 2022) వస్తుంది. మకరరాశిలో శనిసంచారం కొందరికి శుభప్రదంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మేషరాశి (Aries): శని ఈ రాశి యెుక్క పదో ఇంట్లో సంచరిస్తాడు. మకరరాశిలో శని సంచారం ఈ రాశివారు కెరీర్ లో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. లక్ కలిసి వస్తుంది. సమాజంలో గౌరవాన్ని పొందుతారు.  

కర్కాటక రాశి (Cancer): శని సంచారం ఈ రాశి యెుక్క ఏడో ఇంట్లో జరుగుతుంది. అక్టోబర్ 23.తర్వాత ఈ రాశివారి అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.  వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాలు సాధిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. ఫ్యామిలీ సపోర్టు ఉంటుంది. 

తులారాశి (Libra): తులారాశి వారిపై శని ధైయా కొనసాగుతున్నప్పటికీ కూడా వీరు శుభఫలితాలను పొందుతారు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభపడతారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.  ఆరోగ్యం బాగుంటుంది. 

వృశ్చికరాశి (Scorpio): శని సంచారం వృశ్చిక రాశి వారికి మేలు చేస్తుంది. వీరు ఈ సమయంలో ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. సంపద పెరుగుతుంది. అనేక మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. పోలీసు, ఆర్మీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. 

మీనరాశి (Pisces): మీన రాశి వారికి శని సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శని ఈ రాశి యెుక్క లాభ స్థానంలో ఉంటాడు. తద్వారా మీరు అనేక రంగాలలో రాణిస్తారు. కొంత మంది తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఫ్యామిలీ అండతో మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ సమయంలో యోగా, ధ్యానం చేయడం మీకు లాభిస్తుంది. 

Also Read: Sun Transit September 2022 : కన్యారాశిలో సూర్య సంచారం... ఈ రాశులవారి లైఫ్ కష్టాలమయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News