Shani Vakri 2023 Effect: 2023 సంవత్సరంలో శనిదేవుడు తిరోగమన స్థితిలో ఉండబోతున్నాడు. అంతేకాకుండా 2023లో శని గ్రహం మకరరాశిలో సంచరించే అవకాశాలున్నాయి. అయితే ఈ సంచారం జరిగిన వెంటనే చాలా రాశులవారిపై ప్రభావం పడబోతోందని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. దీంతో మంచి కర్మలు చేసిన వారికి శని దేవుడు మంచి ఫలితాలు ఇచ్చే అవకావకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే 2023లో శనిదేవుని తిరోగమనం కారణంగా సాడే సతి ప్రభావం 5 రాశువారిపై తీవ్రంగా పడే ఛాన్స్ ఉంది. అయితే ఏయే రాశువారు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశువారిపై తీవ్ర ప్రభావం:
మీనం:
కుంభరాశిలో శని తిరోగమనం చేయడంతో మీనరాశి వారికి శని సాడే సతి ప్రభావం పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా శని సడే సతి మొదటి దశ ప్రారంభమవుతుంది. దీంతో ఈ రాశి వారికి పలు రకాల దుష్ర్పభావాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
మకరం:
శని మకరరాశి నుంచి తిరోగమనం చెంది ఇతర రాశిలోకి సంచారం జరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ రాశి శని దేవుడి ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. దీంతో ఈ రాశి వారికి చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
కర్కాటక:
కుంభరాశిలో శని గ్రహం సంచారం చేయడం వల్ల కర్కాటకరాశిపై శని గ్రహం ప్రభావం తీవ్ర ఉండబోతోందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో కర్కాటక రాశి వారి జీవితంలో చాలా రకాల మార్పుల సంభవించబోతున్నాయి.
వృశ్చికం:
జనవరి 2023 నుంచి శని ప్రభావం వృశ్చిక రాశి వారిపై కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో వృశ్చిక రాశి వారు అనారోగ్య సమస్యలకు గురవుతారు. కాబట్టి ఈ రాశి వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
కుంభ:
జనవరి 17న మకరరాశిని విడిచిపెట్టిన ఆ తర్వాత శనిగ్రహం కుంభరాశిలో తిరోగమనంలోకి ప్రవేశిస్తుంది. దీంతో పలు ఈ రాశి వారికి తీవ్ర దుష్ప్రభావాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Also Read : Ginna OTT Streaming: మంచు విష్ణు జిన్నా ఓటీటీ స్ట్రీమింగ్ రేపట్నించే, ఎందులోనంటే
Also Read : Adivi Sesh HIT 2: అన్నీ అనుమానాలే.. అందుకే ఇలా ఉన్నా.. అడివి శేష్ కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook