Shiva Panchakshara Stotram: శ్రావణ సోమవారం నాడు శివ పంచాక్షర స్తోత్రం పఠించండి.. శివుని అనుగ్రహం పొందండి!

Sravanam 2022: శ్రావణ మాసంలో ప్రతి రోజు ప్రత్యేకమైనది. ఈ మాసంలో శివ పంచాక్షర స్తోత్రం పఠించడం వల్ల శివుడు ప్రసన్నుడవుతాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 25, 2022, 11:45 AM IST
Shiva Panchakshara Stotram: శ్రావణ సోమవారం నాడు శివ పంచాక్షర స్తోత్రం పఠించండి.. శివుని అనుగ్రహం పొందండి!

Shiva Panchakshara Stotram Significance: శ్రావణం శివారాధనకు ఎంతో ముఖ్యమైన మాసం. ఈ మాసంలో వచ్చే సోమవారాల్లో శివుడిని (Lord shiva) పూజిస్తే మరింత పుణ్యం వస్తుంది. ఇవాళ రెండో శ్రావణ సోమవారం. ఈ రోజున ఉపవాసం ఉంటూ.. ఆయన మంత్రాలను పఠిస్తే మీ కోరకలు నెరవేరుతాయి. శివుడి అనుగ్రహం పొందడానికి శివ పంచాక్షర స్తోత్రం పఠిస్తేచాలు. మీ కోరికలన్నింటిని మహాదేవుడు నెరవేరుస్తాడు. శివ పంచాక్షర స్తోత్రం గుర్తుకు రాని వారు పూజ సమయంలో 'ఓం నమః శివాయ' అనే శివ పంచాక్షర మంత్రాన్ని జపించాలి. మీరు ప్రతిరోజూ లేదా ప్రతి సోమవారం ఈ మంత్రాన్ని పఠించవచ్చు. 

శివ పంచాక్షర స్తోత్రం పఠించే విధానం
మీరు శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించాల్సిన రోజున... ముందుగా శివుడిని పూజించండి. గంగాజలంతో శివుని అభిషేకించండి. ఆ తర్వాత పరమేశ్వరుడికి తెల్లటి పూలు, మందార పువ్వులు, బిల్వ పత్రం, దాతుర, తేనె, ఆవు పాలు, పంచదార, చందనం మొదలైన వాటిని సమర్పించండి. తరువాత ధూపం వేసి.. దీపం పెట్టండి. ఆ తర్వాత శివ పంచాక్షర స్తోత్రం పఠించండి. పఠించేటప్పుడు పదాలను సరిగ్గా ఉచ్చరించాలి. 

శివ పంచాక్షర స్తోత్రం 
నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ ।
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ।
మందాకినీ సలీల్ చందన్ చర్చితాయ్ నందీశ్వర్ ప్రమత్నాథ్ మహేశ్వరై.
మందరపుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మే మే కారయ్ నమః శివాయః ।। 

శివాయ గౌరీవదనాబ్జవృంద సూర్యాయ దక్షధ్వరనాశకయ ।
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికరాయ నమః శివాయ.
వసిష్ఠ కుంభోద్భవగౌతమార్య మునీంద్రదేవార్చితశేఖరాయ।
చంద్రక్ వైశ్వనర్ లోచనాయ తస్మై వకారాయ నమః శివాయ.।। 

యజ్ఞస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనయ ।
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ:.
పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగయ్ మహేశ్వరాయ ।
నిత్యాయ శుద్ధాయ దిగమ్బరాయ తస్మే 'న' కరాయై నమః శివాయః.
ఓం నమః శివాయ్...హర్ హర మహాదేవ్...ఓం నమః శివాయ్!!!

Also Read: Sravana Somavaram 2022: చంద్ర దోషం పోగొట్టుకోవడానికి... శ్రావణ సోమవారం ఇలా చేయండి! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News