Sun Transit 2023 in Aries: హిందూ పంచాంగం ప్రకారం ఇవాళ్టి నుంచి సరిగ్గా 10 రోజుల తరువాత సూర్య గోచారం ఉంది. సూర్యుడి రాశి పరివర్తనంతో మేషరాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా అత్యంత ప్రమాదకరమైన పిత్ర దోషయోగం ఏర్పడనుంది. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు జ్యోతిష్య పండితులు.
గ్రహాల రాజు సూర్యుడు ప్రతి నెలా రాశి మారుతుంటాడు. ఈ నెలలో అంటే ఏప్రిల్ 14వ తేదీన సూర్యుడి గోచారముంది. రాశి పరివర్తనంతో మేష రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ రాశిలో అప్పటికే రాహువు ఉపస్థితుడై ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో మేషరాశిలో సూర్యుడు, రాహువు యుతితో పిత్ర దోష యోగం ఏర్పడనుంది. ఈ యోగం కొన్ని రాశులవారికి భారంగా మారనుంది. అంటే దాదాపు నెలరోజులు ఈ రాశులవాళ్లు చాలా అప్రమత్తంగా ఉండాలి.
పితృదోషంతో ఈ రాశులకు తీవ్ర ఇబ్బందులు
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి జాతకులకు పిత్ర దోషం ప్రభావం ఆరోగ్యంపై చూపించనుంది. కడుపు సంబంధిత వ్యాధులు ఎదురుకావచ్చు. తల్లి ఆరోగ్యం గురించి ఆలోచించుకోవాలి. కోర్టు విషయాలుంటే వికటించవచ్చు. దాంతోపాటు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. బడ్జెట్ గందరగోళంతో ఇబ్బందులు ఎదురౌతాయి. కొత్త పని ప్రారంభించవద్దు. సంతాన సుఖం మాత్రం లభిస్తుంది. ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతాయి.
కన్యా రాశి:
కన్యా రాశి జాతకులకు సూర్యుడి గోచారంతో ఏర్పడే పిత్రు దోష యోగం తీరని హాని కల్గిస్తుంది. ఈ జాతకంవారి ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. జీవితభాగశ్వామితో వివాదం ఏర్పడవచ్చు. ప్రభుత్వ రంగానికి చెందిన వ్యక్తులు చాలా అప్రమత్తంగా ఉండాలి.
కుంభ రాశి:
కుంభ రాశి జాతకులకు సూర్యుడి గోచారం వల్ల ఏర్పడే పితృ దోష యోగం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. భుజం, కీళ్ల నొప్పులు బాధించవచ్చు. అందుకే సమస్య చిన్నగా ఉన్నప్పుడు అలర్ట్ కావాలి. ప్రత్యర్ధులు మీకు భారంగా మారవచ్చు. అకారణంగా ఖర్చులు పెరిగి ఆందోళనకు గురవుతారు. వ్యాపారం మందగించవచ్చు.
Also Read: Jupiter Rise 2023: మేషరాశిలో గురుడు ఉదయించడంతో..ఆ 5 రాశులకు దశ తిరిగిపోవడం ఖాయం
Also Read: Hanuman Janmotsav 2023: హనుమాన్ జయంతి నుంచి భారీ లాభాలు పొందబోయే రాశులవారు వీరే, ఇక లాభాలే లాభాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook