Surya Puja: పుష్యమాసంలో ఇలా సూర్యభగవానుడికి పూజలు చేస్తే..ఆర్థిక సమస్యలన్నీ మటు మాయం..

Paush Month Start Date In 2022: ఒక్కొక్క నెలలో ఒక్కొక్క దేవున్ని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే డిసెంబర్ నుంచి జనవరి నెలలో సూర్య భగవానున్ని పూజించడం పురాణాల్లో నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని జ్యోతిష్య శాస్త్ర చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2022, 12:28 PM IST
Surya Puja: పుష్యమాసంలో ఇలా సూర్యభగవానుడికి పూజలు చేస్తే..ఆర్థిక సమస్యలన్నీ మటు మాయం..

Surya Puja In Paush Month 2022: గ్రంథాల ప్రకారం ప్రతి నెలలో ఒక్కొక్క రోజు ఒక్కో దేవున్ని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. కార్తీక మాసంలో శ్రీమహావిష్ణువుని ఎలా పూజిస్తారో.. మార్గశిర మాసంలో శ్రీకృష్ణుని కూడా అలాగే పూజించడం పురాణాల నుంచి వస్తోంది. అయితే మార్గశిర మాసం ముగియగానే పౌష మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో సూర్యభగవానుడిని పూజించడం చాలా మంచిది. భక్తి శ్రద్ధలతో ఆయనను పూజించడం వల్ల కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని పురాణాల్లో పేర్కొన్నారు. 

అంతేకాకుండా పౌషమాసంలో క్రమం తప్పకుండా సూర్య భగవానుని పూజించడం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. అందుకే చాలామంది భక్తులు ఉదయాన్నే స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి పూజా కార్యక్రమాలు చేస్తారు. అంతేకాకుండా నిపుణులు సూచించిన ఈ పద్ధతిలో పూజలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. పూజా కార్యక్రమంలో అనుసరించే పద్ధతుల గురించి తెలుసుకుందాం..

సూర్య భగవానుని ఇలా పూజించాలి:
ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం చేయాల్సి ఉంటుంది. తర్వాత సూర్యుడు ఉదయించాక సూర్య భగవానుని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రటి పువ్వులు, అక్షింతలు వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాల్సి ఉంటుంది. ఇలా సమర్పించే క్రమంలో ఆ నీరు కింద పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీ పాదాలపై పడకుండా కింద పాత్రను పెట్టాల్సి ఉంటుంది. 

అర్ఘ్యం సమర్పించే క్రమంలో ఇలా చేయండి: 
సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు మూడుసార్లు నీరు సమర్పించాలని పురాణాల్లోని వివరించారు. అంతేకాకుండా దీని తర్వాత  ప్రదక్షిణలు కూడా చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత భక్తి శ్రద్ధలతో నైవేద్యాన్ని కూడా కొందరు సమర్పిస్తారు. సమర్పించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేయడమే కాకుండా శాంతి నెలకొంటుంది.

సూర్య భగవానుని మంత్రాలను జపించండి:
ఓం హ్రీ హ్రీ సూర్య సహస్రకిరణరాయ మనోవాంఛిత్ ఫలం దేహి దేహి స్వాహా..

Also Read: Chamika Karunaratne: అయ్యో కరుణరత్నే.. క్యాచ్ కోసం మూతి పళ్లు రాళగొట్టుకున్నాడు.. వీడియో వైరల్  

Also Read: Minister KTR: సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు.. కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

 

Trending News