Varalakshmi Vratham 2022: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొచ్చింది, ప్రాధాన్యత, పూజా సయమం, విధి విధానాలేంటి, వ్రతం ఎవరుండాలి

Varalakshmi Vratham 2022: హిందూవులు అత్యంత పవిత్రంగా భావించే వరలక్ష్మీ వ్రతం ఈసారి ఆగస్టు 12న వస్తోంది. వరలక్ష్మీ వ్రతం అనేది..పూర్తిగా లక్ష్మీదేవికి అంకితం. అసలు వరలక్ష్మీ వ్రతం అంటే ఏంటి, మహత్యమేంటి, కలిగే ప్రయోజనాలు చూద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 11, 2022, 12:00 AM IST
Varalakshmi Vratham 2022: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొచ్చింది, ప్రాధాన్యత, పూజా సయమం, విధి విధానాలేంటి, వ్రతం ఎవరుండాలి

Varalakshmi Vratham 2022: హిందూవులు అత్యంత పవిత్రంగా భావించే వరలక్ష్మీ వ్రతం ఈసారి ఆగస్టు 12న వస్తోంది. వరలక్ష్మీ వ్రతం అనేది..పూర్తిగా లక్ష్మీదేవికి అంకితం. అసలు వరలక్ష్మీ వ్రతం అంటే ఏంటి, మహత్యమేంటి, కలిగే ప్రయోజనాలు చూద్దాం..

శ్రావణమాసం నెల ఇప్పుడు చివర్లో ఉంది. శ్రావణమాసంలోని చివరి శుక్రవారం చాలా ప్రాధాన్యత కలిగింది. ఆ రోజు లక్ష్మీదేవికి అంకితంగా భావిస్తారు. ఆ రోజు పెళ్లైన మహిళలు, పురుషులు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. ఫలితంగా సౌభాగ్యం లభిస్తుందని అంటారు. జీవితంలో పేదరికం పోతుందంటారు. ఈసారి ఆగస్టు 12వ తేదీన వరలక్ష్మీ వ్రతం వచ్చింది. ఈ నేపధ్యంలో వరలక్ష్మీ వ్రతం మహత్యం, ఉపయోగాలు తెలుసుకుందాం..

ఈసారి వరలక్ష్మీ వ్రతం శ్రావణమాసం పౌర్ణిమ నాడు ఉంది. రెండు పవిత్ర సందర్భాలు ఒకేసారి రావడం వల్ల వరలక్ష్మీ వ్రతం మహత్యం మరింత పెరిగింది. ఆ రోజు ఉదయం 11 గంటల 34 నిమిషాల వరకూ సౌభాగ్య యోగముంది. ఆ తరువాత శోభన యోగం ప్రారంభం కానుంది. ఇక పూజలు చేసేందుకు ఉదయం 6 గంటల 14 నిమిషాల్నించి 8 గంటల 32 నిమిషాల వరకూ ఉంది. ఆ తరువాత మళ్లీ మద్యాహ్నం 1 గంట 7 నిమిషాల్నించి 3 గంటల 26 నిమిషాల వరకూ...తిరిగి సాయంత్రం 7 గంటల 12 నిమిషాల్నించి 8 గంటల 40 నిమిషాల వరకూ ఉంది. 

వరలక్ష్మీ వ్రతం అనేది భారతదేశంలోనే ఎక్కువగా జరుపుకుంటారు. కానీ దక్షిణ భారతదేశంలో ఎక్కువ ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. ఈ వ్రతం కేవలం పెళ్లైనవారే ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని అష్టలక్ష్మీ పూజతో సమానంగా భావిస్తారు. ఈ వ్రతం ఉండటం వల్ల పేదిరకం దూరమై..ఇంట్లో సౌభాగ్యం, సుఖ సంతోషాలు, సంతానం ఇలా అన్నీ ప్రాప్తిస్తాయి. ఈ వ్రతం వల్ల కలిగే పుణ్యం ఎక్కువకాలం ఉంటుంది. రానున్న తరాలకు ఈ వ్రతం వల్ల మంచి ఉపయోగాలున్నాయి.

మీరు ఒకవేళ తొలిసారిగా వరలక్ష్మి వ్రతం ఉంటుంటే..కొన్ని ముఖ్యమైన, కీలకమైన విషయాల్ని గుర్తుంచుకోవాలి. ఉదయం స్నానం తరువాత వ్రతం సంకల్పం చేయాలి. పూజ కోసం ఓ గుమ్మంపై ఎర్రటి వస్త్రం పరిచి లక్ష్మీదేవి, గణేశుని బొమ్మలు పెట్టాలి. ఆ తరువాత కుంకుమ, చందనం, అత్తరు, ధూపం, వస్త్రం, అక్షింతలు, నైవేద్యం సమర్పించాలి. గణేశుని ముందు నెయ్యి, లక్ష్మీదేవికి గానుగ నూనెతో దీపం వెలిగించాలి. ఆ తరువాత గణపతి నామంతో మంత్రాలు పఠించాలి. ఆ తరువాత లక్ష్మీదేవిని పూజించాలి. చివరిగా వరలక్ష్మీ వ్రతం కధ వినడమో, చదవడమో చేసి..హారతి ఇవ్వాలి. 

Also read: Rakhi and Zodiac Signs: రాశిని బట్టి రాఖీ రంగు.. మీ సోదరుడి రాశిని బట్టే ఏ రంగు రాఖీ కట్టాలో తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News