Shukra Gochar 2022: 8 రోజుల తర్వాత ఈ రాశులవారి జీవితంలో పెను మార్పులు, ఇక వీరికి తిరుగుండదు..

Shukra Gochar 2022: సెప్టెంబర్ 24న శుక్ర గ్రహం కన్యారాశిలోకి ప్రవేశించబోతోంది. శుక్రుడు రాశి మారడం వల్ల ఈ రాశుల వారు విశేష ప్రయోజనాలను పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2022, 04:27 PM IST
Shukra Gochar 2022: 8 రోజుల తర్వాత ఈ రాశులవారి జీవితంలో పెను మార్పులు, ఇక వీరికి తిరుగుండదు..

Shukra Gochar 2022 Effect: శుక్ర గ్రహం.. ఆనందం, శ్రేయస్సు, ఐశ్వర్యం మెుదలైన వాటికి కారకుడు.  సెప్టెంబర్ 24, ఉదయం 8:51 గంటలకు శుక్ర గ్రహం కన్యారాశిలో సంచరించబోతోంది. ఆస్ట్రాలజీ ప్రకారం, ఏదైనా గ్రహం యెుక్క రాశి మార్పు మెుత్తం అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా శుక్రుడిని శుభగ్రహం పరగణిస్తారు. అయితే కన్యారాశిలోకి శుక్రుడు ప్రవేశించే సమయానికి సూర్యుడు, బుధుడు అక్కడే ఉంటారు. ఈ మూడు గ్రహాల కలయిక కొందరికి కలసి వస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

వృషభం (Taurus)- కన్యారాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి చాలా మేలు జరుగుతుంది. వృషభ రాశిని పాలించే గ్రహం శుక్రుడు కాబట్టి ఈ రాశివారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. పెట్టుబి పెట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి రాబడిని పొందుతారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. 

మిథునం (Gemini)- ఈ రాశి వారికి అదృష్టం కలిసివస్తుంది. అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది. శుక్రగ్రహ సంచారం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. 

కన్య (Virgo)- సెప్టెంబర్ 24 తర్వాత ఈ రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. ఈ కాలంలో మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్‌లో కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. వ్యాపారుల భారీగా లాభపడతారు. 

Also Read: Shani Margi 2022 Date: శని మార్గం... అక్టోబర్ 23 నుండి ఈ రాశులవారిపై డబ్బు వర్షం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News