Moles Meaning: అందమైన అమ్మాయిల పెదాలపై పుచ్చుమచ్చ ఉంటే ఆ అందం మరింత ద్విగుణీకృతమౌతుందంటారు. కానీ కాస్త అటూ ఇటైనా సమస్యలు చుట్టుముడతాయంటున్నారు జ్యోతిష్య పండితులు.
అమ్మాయిలకు పెదాలపై చిన్న పుట్టుమచ్చ ఉండటం అందం పరంగా మంచిదే. అందాన్ని పెంచుతుంది. కానీ ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. అదే పుట్టుమచ్చ అటూ ఇటూగా ఉంటే మాత్రం జీవితంలో కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో జ్యోతిష్య పండితులు చేసే సూచనలేంటో తెలుసుకుందాం..
చాలామంది అమ్మాయిలు అందాన్ని పెంచుకునేందుకు లేదా అందంగా కన్పించేందుకు పెదాలపై ఆర్టిఫిషియల్ పుట్టుమచ్చలు వేయించుకుంటుంటారు. కొంతమందికి సహజసిద్దంగా పుట్టుకతో ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ పుట్టుమచ్చలకు చాలా అర్ధాలున్నాయి. ఆ వ్యక్తి జీవితంపై దీని ప్రభావం చాలా రకాలుగా ఉంటుంది. కొంతమందికి అనుకూలంగా ఉండవచ్చు మరి కొంతమందికి ప్రతికూలంగా ఉండవచ్చు. ఇంకొంతమంది వివిధ రకాల సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొంతమంది జాతకులు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోతారు. లేదా అనవసరమైన విషయాల్లో ఇరుక్కుంటారు. ప్రత్యర్ధి అక్రమాలకు బలవుతుంటారు. పెదాలపై పుట్టుమచ్చ ఉండే మూల నక్షత్రం జాతకులు సహచరుల కంటే భిన్నంగా ఉంటారు. వీరి ఆలోచనలు కూడా ప్రత్యేకంగానే ఉంటాయి. మూలా నక్షత్రంలో ఈ జాతకులు స్వభావరీత్యా కోపిష్టులు. వీరి ఆరోగ్యం కూడా తరచూ పాడవుతుంటుంది. కానీ అనుకున్న పని సాధించేందుకు ఎందాకైనా వెళతారు. వీరి గమ్యం ఎప్పుడూ లక్ష్యం వైపే ఉంటుంది. మూల నక్షత్రంవారికి గురువు కేతువు. రాశిపరంగా అయితే గురువు గురుగ్రహం. అందుకే పెదాలపై పుట్టుమచ్చ ఉండేవారి జీవితంపై గురు, కేతువులు రెండింటి ప్రభావం ఉంటుంది. కేతువు నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తే..గురుగ్రహం పాజిటివ్ ప్రభావాన్ని అందిస్తుంది.
Also read: Tree Worship Remedies: సమస్యలతో బాధపడుతున్నారా..ఏ చెట్లను పూజిస్తే ఏ కోర్కెలు నెరవేరుతాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook