Aakash Chopra: టీమిండియాలో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి.. అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కష్టమే: ఆకాశ్‌

భారత జట్టులో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయని టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. అజింక్య రహానేకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం కష్టమే అని పేర్కొన్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 20, 2021, 03:08 PM IST
  • టీమిండియాలో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి
  • అజింక్య రహానేకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కష్టమే
  • రోహిత్‌ శర్మ స్థానంలో లోకేష్ రాహుల్‌
Aakash Chopra: టీమిండియాలో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి.. అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కష్టమే: ఆకాశ్‌

Aakash Chopra feels Ajinkya Rahane might find it difficult to find a place in playing 11: భారత జట్టులో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయని టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా (Aakash Chopra) అభిప్రాయపడ్డాడు. స్టార్ ఆటగాళ్లకు ప్లేయింగ్ ఎలెవన్‌ (Playing 11)లో చోటు దక్కడం కష్టమే అని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు (SA Tour) ముందు టీమిండియాలో చాలా పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. టెస్ట్ జట్టు వైస్‌ కెప్టెన్‌గా అజింక్య రహానే (Ajinkya Rahane)ను తప్పించి.. ఆ బాధ్యతలను రోహిత్‌ శర్మకు అప్పగించింది బీసీసీఐ. ఆపై వన్డే సారథిగా ఉన్న విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను నియమించారు బీసీసీఐ సెలెక్టర్లు. దాంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. 

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు రోహిత్‌ శర్మ (Rohit Sharma) ప్రాక్టీస్ చేస్తూ గాయపడటంతో.. అతడి స్థానంలో లోకేష్ రాహుల్‌ (KL Rahul)ను వైస్‌ కెప్టెన్‌గా బీసీసీఐ సెలెక్టర్లు నియమించారు. దాంతో ఇన్నిరోజులు జట్టు వైస్‌ కెప్టెన్‌గా కొనసాగిన అజింక్య రహానేకు నిరాశే మిగిలింది. కెప్టెన్సీ పోవడానికి రహానే పూర్ ఫామ్ కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది 12 టెస్టుల్లో 19.57 సగటుతో కేవలం 411 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే జింక్స్ విదేశీ గడ్డపై 40కి పైగా సగటును కలిగి ఉన్నాడు. రహానే 12 టెస్ట్ సెంచరీలలో ఎనిమిది విదేశాల్లో చేశాడు. ఇది ఒక్కటి అతడికి అనుకూలంగా ఉన్నాయి. అయినా కూడా దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టుల్లో రహానేకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కష్టమే అని ఆకాశ్‌ చోప్రా అంటున్నాడు.

Also Read: Vamika: మీడియాకు ధన్యవాదాలు.. ఇలాగే మాకు అండగా ఉంటారనుకుంటున్నా: అనుష్క శర్మ

'కూ'లో షేర్ చేసిన ఓ వీడియోలో ఆకాశ్‌ చోప్రా (Aakash Chopra) మాట్లాడుతూ... 'దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు రోహిత్‌ శర్మ గాయపడటంతో అతడి స్థానంలో లోకేష్ రాహుల్‌ (KL Rahul)ను వైస్‌ కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది. రాహుల్ ద్రవిడ్‌ కోచ్‌గా ఉన్నాడు. మరోవైపు రోహిత్‌ ఇటీవలే పూర్తిగా వైట్-బాల్ ఫార్మాట్‌లకు కెప్టెన్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే రాహుల్‌ త్వరలోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికవుతాడని అనుకుంటున్నా. ఒకవేళ రాహుల్‌ క్లిక్‌ అయితే టెస్టుల్లో రహానే (Ajinkya Rahane) స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది. జింక్స్ మొన్న కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేశాడు. ఇప్పుడు వైస్‌ కెప్టెన్‌గానూ చోటు కోల్పోయాడు. ఇవన్నీ చూస్తుంటే.. టీమిండియాలో పరిస్థితులు వేగంగా  మారిపోతున్నాయి' అని అన్నాడు. 

Also Read: Peng Shuai: నాపై లైంగిక దాడి జ‌ర‌గలేదు.. యూటర్న్‌ తీసుకున్న టెన్నిస్ స్టార్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News