ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్ లీగ్ నిర్వహణకు బీసీసీఐ యూఏఈను ( UAE ) ఎంచుకుంది. దానికి తగిన విధంగానే దుబయి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కరోనావైరస్ ( Coronavirus ) నుంచి రక్షణ పొందడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. టెక్నికల్ స్టాఫ్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. కానీ కోల్ కతా విధ్వంసక క్రీడాకారుడు ఆండ్రూ రసెల్ షాట్స్ నుంచి కెమెరాలను ఎలా రక్షించుకోవాలి అనే విషయంపై ఎవరూ ఫోకస్ పెట్టలేదేమో.
ALSO READ| IPL: ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే
బుధవారం నుంచి కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ( IPL 2020 ) ప్రయాణం మొదలు కానుంది. దాంతో ఆ టీమ్ మోస్ట్ డేంజరస్ ప్లేయర్ ఆండ్రూ రసెల్స్ ( Andre Russell )ప్రాక్టిస్ చేయడం ప్రారంభించాడు. అయితే అతని ప్రాక్టిస్ చేయడం కూడా ఇప్పుడు సెన్సేషన్ గా మారిపోయింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
సీపిఎల్ (CPL) కారణంగా అబుధాబికి సెప్టెంబర్ 11న చేరుకున్నాడు రస్సెల్స్. తరువాత ఆరు రోజుల పాటు ఐసోలేషన్ లో ఉన్నాడు. తరువాత ప్రాక్టిస్ చేయడం మొదలు పెట్టాడు. బుధవారం ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) తో జరిగే మ్యాచుకు ముందు సాధన చేయడం స్టార్ట్ చేశాడు. ప్రాక్టిస్ సమయంలో డ్రూ రాస్ ( Drew Ross ) బంతులు విసరగా.. ఆండ్రూ రసెల్స్ స్మాషింగ్ షాట్ కొట్టాడు. అంతే కెమెరా లెన్స్ పుటుక్కుమని విరిగిపోయింది.
ALSO READ| Mukesh Ambani Facts: ముఖేష్ అంబానీ నిమిషానికి 23 లక్షలు సంపాదిస్తాడు తెలుసా ?
క్రికెట్ సమాచారాన్ని షేర్ చేసే వెబ్ సైట్ 'Smart SAT'ప్రకారం అన్నీ గణాంకాలు కూడా ఆండ్రూ రసేల్ ఐపీఎల్ లో అత్యంత విధ్వంసకరమై బ్యాట్స్ మెన్ అని చెబుతోంది. రసేల్ ఆట తీరు విధ్వంసంగా, ఉద్రేకపూరితంగా ఉంటుంది అని చెబుతోంది. సమస్యల్లో ఉన్న ఇన్నింగ్స్ ను ఒంటి చేతితో చక్కబెట్టే సత్తా రస్సేల్స్ కు ఉంది అని చెబుతోంది. కొన్ని రొజుల క్రితం కోల్ కతా నైట్ రైడర్స్ మెంటార్ డేవిడ్ హస్సీ కూడా ఐపీఎల్ లో 200 చేయగలగడం కేవలం రస్సెల్స్ వల్ల మాత్రమే అవుతుంది అని అన్నాడు.
ALSO READ| Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా ? ఈ విషయంలో జాగ్రత్త