Angelo Mathews Timeout Controversy: శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మ్యాథ్యూస్ టైమ్ ఔట్ ప్రకంపనలు రేపుతోంది. మ్యాథ్యూస్ మైదానంలోకి వచ్చి.. హెల్మెట్‌లో సమస్య వల్ల స్టైకింగ్ తీసుకునేందుకు ఆలస్యం చేయడంతో బంగ్లా ప్లేయర్లు టైమ్ ఔట్ కోసం అప్పీల్ చేశారు. దీంతో మ్యాథ్యూస్‌ను అంపైర్లు ప్రకటించారు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హాసన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కామన్ సెన్స్‌లేని క్రికెటర్ అంటూ క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ ఘటన తరువాత మ్యాచ్ ముగిసిన అనంతరం బంగ్లాదేశ్ ఆటగాళ్లతో శ్రీలంక ప్లేయర్లు కరచాలనం కూడా చేయలేదు. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయారు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో టైమ్ అవుట్ అయిన తొలి బ్యాట్స్‌మెన్‌గా మ్యాథ్యూస్ నిలిచాడు.
ఎంసీసీ రూల్స్ ప్రకారం.. బ్యాట్స్‌మెన్ ఔట్ అయిన తరువాత మరో బ్యాట్స్‌మెన్ 2 నిమిషాల్లో బంతిని ఎదుర్కొవాల్సి ఉంటుంది. అయితే సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సదీర సమరవిక్రమ ఔట్ అయిన తరువాత మ్యాథ్యూస్ వెంటనే మైదానంలోకి వచ్చాడు. కానీ హెల్మెట్ పట్టీ ఊడిపోవడంతో మరో హెల్మెట్ తెప్పించుకోవడానికి సమయం పట్టింది. కాసేపటికే బంగ్లా కెప్టెన్ షకీబుల్ హసన్ ఔట్ కోసం అప్పీల్ చేయడంతో.. నిబంధనల ప్రకారం అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. మ్యాచ్ తర్వాత శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్, టీమ్ ఆటగాళ్లు బంగ్లాదేశ్ బ్యాటర్లతో పాటు జట్టుతో కరచాలనం చేయడానికి ఇష్టపడలేదు. కరచాలనం చేసేందుకు శ్రీలంక నిరాకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బంగ్లా ఆటగాళ్లతో షేక్ హ్యాండ్‌ను నిరాకరించడంతో తమ జట్టు ఎలాంటి తప్పు చేయలేదని ఏంజెలో మాథ్యూస్ అభిప్రాయపడ్డాడు. ఎవరైనా ఇతరుల నుంచి గౌరవం పొందాలనుకుంటే.. అవతలి వ్యక్తి కూడా అలాంటి గౌరవం ఇవ్వాలని అన్నారు. తామంతా ఈ జెంటిల్‌మెన్ గేమ్‌కు అంబాసిడర్లు అని.. ఇతరులకు గౌరవించాలనే ఇంగితజ్ఞానాన్ని ఉపయోగించకపోతే ఎలా అని ఫైర్ అయ్యాడు. తానేమీ తప్పు చేయలేదని.. బ్యాటింగ్ కోసం 2 నిమిషాల్లోపే సిద్ధమయ్యాయని చెప్పాడు. హెల్మెట్ సరిగా లేదని బంగ్లా ఆటగాళ్లకు.. అంపైర్లకు చెప్పానని.. అయితే వారి కామన్‌సెన్స్ ఏమైందో తెలియదన్నాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హాసన్, ఇతర ఆటగాళ్ల నుంచి అవమానకరరీతిలో స్పందన వచ్చిందన్నాడు. తన దగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయని.. వారి కామన్‌సెన్స్‌కే వదిలేస్తున్నానని చెప్పాడు.
Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook