BCCI Invites Applications for Indian Team Selector Job: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) కొత్త సైకిల్‌లోకి టీమిండియా ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ సెలక్టర్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది. జీ న్యూస్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాలు.. భారత ఆటగాళ్లు, జట్టు ఎంపికకు సంబంధించిన రహాస్య వివరాలను లీక్ చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తరువాత చేతన్ శర్మ చీఫ్ సెలక్టర్ పదవికి రాజీనామా చేయగా.. కమిటీలోని సభ్యుడు శివసుందర్ దాస్ ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.
వెస్టిండీస్ సిరీస్‌కు ముందు సెలక్షన్ కమిటీలో ఒక సభ్యుడి పోస్ట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. సెలక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 30వ తేదీగా నిర్ణయించింది. దరఖాస్తు చేసుకున్న తరువాత.. ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ అనంతరం కొత్త సెలక్టర్‌ను బీసీసీఐ ప్రకటించనుంది. కొత్తగా ఎన్నికైన సెలక్షన్ కమిటీ ఐర్లాండ్ టూర్‌కు ముందు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. కొత్త సెలక్టర్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన అర్హతలను నోటిఫికేషన్లో పేర్కొంది.
Also Read: Titanic Submarine: చివరికి విషాదాంతం.. టైటాన్ సబ్‌మెరైన్‌లో ఐదుగురు మృతి
అర్హతలు ఇవే..
==> 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి లేదా
==> 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు లేదా
==> 10 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి.
==> దరఖాస్తు చేసుకునే అభ్యర్థి అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిపోయి 5 ఏళ్లు పూర్తవ్వాలి.
==> ఈ ఐదేళ్లలో ఏదైనా క్రికెట్ కమిటీలో మెంబర్‌గా ఉంటే.. సెలెక్షన్ కమిటీకి దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు.
చీఫ్ సెలక్టర్ పదవి రేసులో వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది. కోచ్ పదవిపై ఆసక్తిగా ఉన్న ఈ మాజీ డాషింగ్ ఓపెనర్.. సెలెక్టర్ కోసం దరఖాస్తు చేసుకుంటాడో లేదో చూడాలి మరి. ప్రస్తుతం ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీకి భారత మాజీ క్రికెటర్ శివ సుందర్ దాస్ నేతృత్వం వహిస్తున్నారు. కమిటీలో సుబ్రొతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ సభ్యులుగా ఉన్నారు.
Also Read: Underwater Metro: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలోనే భారత్‌లో అండర్ వాటర్ మెట్రో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి