Arshdeep Singh Trolled: ఏంది సామీ.. ఏం చేస్తున్నవు నువ్వు.. అర్షదీప్ సింగ్‌ని దారుణంగా ఏడిపించిన ట్రోలర్స్

Trolls on Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్‌ని క్రికెట్ ఫ్యాన్స్ ఒక ఆటాడుకోవడానికి ఆ ఒక్కటి చాలదా చెప్పండి. అర్ష్‌దీప్ సింగ్‌ హ్యాట్రిక్ చేసినప్పటి నుంచే అతడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ షురూ అయింది. ఇక శ్రీలంకపై టీమిండియా ఓటమిపాలవడంతో ఆ ఆగ్రహంతో ఉన్న అభిమానులు మరీ ఎక్కువ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2023, 11:56 PM IST
Arshdeep Singh Trolled: ఏంది సామీ.. ఏం చేస్తున్నవు నువ్వు.. అర్షదీప్ సింగ్‌ని దారుణంగా ఏడిపించిన ట్రోలర్స్

Trolls on Arshdeep Singh: టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ని టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఏంది సామీ.. ఏం ఆటాడతున్నావు నువ్వు అంటూ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. దానికి కారణం శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో అర్ష్‌దీప్ సింగ్‌ హ్యాట్రిక్ కొట్టడమే. అదేంటి హ్యాట్రిక్ కొడితే మెచ్చుకోవాలి కానీ ట్రోలింగ్ ఎందుకు అనే కదా మీ డౌట్.. మరేం లేదులెండి. 

అర్ష్‌దీప్ సింగ్‌ హ్యాట్రిక్ చేశాడని అభినందించడానికి మనోడు వరుసపెట్టి వికెట్స్ తీయడమో లేక మేడిన్ ఓవర్స్ చేయడమో చేయలేదు.. వరుసగా మూడు నో బాల్స్ వేశాడు. అందుకే క్రికెట్ ప్రియుల ఆగ్రహానికి గురవుతున్నాడు. 

శ్రీలంకపై బౌలింగ్ వేయడానికి వచ్చిన అర్ష్‌దీప్ సింగ్‌... తన మొదటి ఓవర్ లోనే ఏకంగా హ్యాట్రిక్ నో బాల్స్ ఇచ్చి ప్రత్యర్థి జట్టుకు ఆ ఒక్క ఓవర్లోనే మొత్తం 19 పరుగులు సమర్పించుకున్నాడు.

అర్ష్‌దీప్ సింగ్‌ని క్రికెట్ ఫ్యాన్స్ ఒక ఆటాడుకోవడానికి ఆ ఒక్కటి చాలదా చెప్పండి. అర్ష్‌దీప్ సింగ్‌ హ్యాట్రిక్ చేసినప్పటి నుంచే అతడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ షురూ అయింది. ఇక శ్రీలంకపై టీమిండియా ఓటమిపాలవడంతో ఆ ఆగ్రహంతో ఉన్న అభిమానులు మరీ ఎక్కువ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.

Trending News