India vs Australia: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

కరోనా కారణంగా సుదీర్ఘ విరామం త‌ర్వాత భారత జట్టు బరిలోకి దిగింది. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్ సిడ్నీ వేదికగా శుక్రవారం ప్రారంభమైంది.

Last Updated : Nov 27, 2020, 10:23 AM IST
  • కరోనా కారణంగా సుదీర్ఘ విరామం త‌ర్వాత భారత జట్టు బరిలోకి దిగింది. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్ సిడ్నీ వేదికగా శుక్రవారం ప్రారంభమైంది.
  • ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను ఎంచుకుంది.
India vs Australia: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

India vs Australia 1st ODI Live Score: కరోనా కారణంగా సుదీర్ఘ విరామం త‌ర్వాత భారత జట్టు బరిలోకి దిగింది. భారత్‌, ఆస్ట్రేలియా ( India vs Australia ) మధ్య తొలి వన్డే మ్యాచ్ సిడ్నీ వేదికగా శుక్రవారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. సిడ్నీ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న భారత జట్టు బ్లూ జెర్సీతో మైదానంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు కోవిడ్ నిబంధనలతో 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించారు. చాలా రోజుల త‌ర్వాత ప్రధాన జట్ల మధ్య జ‌ర‌గనున్నమ్యాచ్‌పై క్రికెట్ ప్రేమికులు ప్ర‌త్యేక ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. 

అంతకుముందు భారత జట్లు మార్చి 2న చివరిసారి న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ వ్యాప్తి కారణంగా రద్దయింది. 

భార‌త్ టీం:  శిఖ‌ర్ ధావ‌న్, మ‌యాంక్ అగ‌ర్వాల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్య‌ర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, న‌వ‌దీప్ సైనీ, జస్ప్రీత్ బుమ్రా, చాహ‌ల్ ఉన్నారు. Also read: Shoaib Akhtar: డ్రగ్స్ వాడమని ఒత్తిడి తెచ్చేవారు..వాళ్లెవరంటే

ఆస్ట్రేలియా టీం:  డేవిడ్ వార్న‌ర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), స్టీవెన్ స్మిత్, లబుషేన్‌, స్టోనిస్, క్యారీ, మ్యాక్స్‌వెల్‌, క‌మ్మిన్స్‌, స్టార్క్ , జంపా, హాజిల్ వుడ్, ఆడం జంపా ఉన్నారు. 

 Also read: Dele Alli catch viral video: ఫుట్‌బాల్ ప్లేయర్ క్రికెట్ బాల్ క్యాచ్ పడితే ఇలా ఉంటుందా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News