Shane Warne Injured: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్

Shane Warne injured in road accident: లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరాడు. కొడుకుతో కలిసి బైక్‌పై వెళ్తున్న సమయంలో కిందపడి గాయాలపాలయ్యాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 11:13 AM IST
  • రోడ్డు ప్రమాదంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ వార్న్‌కు గాయాలు
    కొడుకుతో బైక్‌పై వెళ్తుండగా కిందపడిపోయిన షేన్ వార్న్
    ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వార్న్
Shane Warne Injured: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్

Shane Warne injured in road accident: ఆస్ట్రేలియా (Australia) మాజీ క్రికెటర్, లెజెండరీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ (Shane Warne) మెల్‌బోర్న్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ప్రమాదంలో ఆయన పాదం, చీలమండ భాగాలకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వార్న్ తన కొడుకు జాక్సన్‌తో కలిసి బైక్ రైడ్ చేస్తున్నాడు. ఆ బైక్ బరువు సుమారు 300 కిలోలు. వేగంగా దూసుకెళ్తున్న క్రమంలో బైక్‌పై నుంచి వార్న్ అదుపు తప్పి కింద పడిపోయాడు. దాదాపు 15మీటర్ల మేర రోడ్డుపై దొర్లుకుంటూ పోయాడు.

నిజానికి ఆ సమయంలో వార్న్‌కు (Shane Warne) పెద్దగా గాయాలేమీ తగిలినట్లు అనిపించలేదు. కానీ మరుసటిరోజు ఉదయం పాదం, చీలమండ, నడుము కింద భాగంలో నొప్పితో బాధపడ్డాడు. దీంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో తాను గాయపడ్డానని... నొప్పితో బాధపడుతున్నందునా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని వార్న్ పేర్కొన్నట్లు ఆస్ట్రేలియా మీడియా రిపోర్ట్ చేసింది. డిసెంబర్ 8 నుంచి బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల ప్రారంభమయ్యే యాషెస్ టెస్టు సిరీస్‌కు (Ashes Series) షేన్ వార్న్ కామెంటేటర్‌గా వ్యవహరించాల్సి ఉంది. అయితే ఆలోపు తాను కోలుకుంటానని వార్న్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

స్పిన్నర్ షేన్ వార్న్ ఆస్ట్రేలియా తరుపున అంతర్జాతీయ క్రికెట్‌లో (Cricket) 1000 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో అత్యధిక వికెట్లు (708) సాధించిన రెండో బౌలర్‌గా వార్న్ రికార్డుల్లోకి ఎక్కాడు. 194 వన్డేలు ఆడిన వార్న్ 293 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్‌లో 55 మ్యాచ్‌లు ఆడి 57 వికెట్లు తీశాడు. జులై, 2013లో క్రికెట్‌లో అన్ని రకాల ఫార్మాట్స్‌కు షేన్ వార్న్ గుడ్ బై ప్రకటించాడు. రిటైర్‌మెంట్ తర్వాత వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు.

Also Read: IND vs NZ 1st Test: కాన్పూర్ టెస్టు నాలుగో రోజు టీమ్ఇండియాదే ఆధిపత్యం.. న్యూజిలాండ్ 4/1

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News