India vs Australia 2nd ODI: టాస్ గెలిచి మళ్లీ బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

సిడ్నీ వేదిక‌గా మ‌రో స‌మ‌రం ప్రారంభమైంది. తొలి వ‌న్డేలో ప‌రాజ‌యం పాలైన భార‌త్ ఈ రోజు ఆతిథ్య జట్టు ఆసీస్‌ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో మైదానంలోకి అడుగుపెట్టింది. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ సిడ్నీ వేదికగా జరుగుతోంది.

Last Updated : Nov 29, 2020, 09:58 AM IST
  • సిడ్నీ వేదిక‌గా మ‌రో స‌మ‌రం ప్రారంభమైంది. తొలి వ‌న్డేలో ప‌రాజ‌యం పాలైన భార‌త్ ఈ రోజు ఆతిథ్య జట్టు ఆసీస్‌ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో మైదానంలోకి అడుగుపెట్టింది. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ సిడ్నీ వేదికగా జరుగుతోంది.
  • ఈ మ్యాచ్‌లో కూడా మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను ఎంచుకుంది.
India vs Australia 2nd ODI: టాస్ గెలిచి మళ్లీ బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

India vs Australia 2nd ODI Live Score: సిడ్నీ వేదిక‌గా మ‌రో స‌మ‌రం ప్రారంభమైంది. తొలి వ‌న్డేలో ప‌రాజ‌యం పాలైన భార‌త్ ఈ రోజు ఆతిథ్య జట్టు ఆసీస్‌ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో మైదానంలోకి అడుగుపెట్టింది. భారత్‌, ఆస్ట్రేలియా (India vs Australia 2nd ODI) మధ్య రెండో వన్డే మ్యాచ్ సిడ్నీ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా.. గెలిచి సిరీస్‌లో నిలవాల‌ని భార‌త్ భావిస్తుంటే, ఆసీస్ ఈ మ్యాచ్‌లో కూడా భారీ విజ‌యం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. అయితే ఆసీస్ కేవ‌లం ఒకే  ఒక్క మార్పుతో ఈ మ్యాచ్‌లోకి బ‌రిలోకి దిగింది. స్టోయినిస్ స్థానంలో హెన్రిక్స్ బ‌రిలోకి దిగుతున్నాడు. ఇక ఇండియా ఎలాంటి మార్పులు లేకుండానే ఆసీస్‌తో పోరాడేందుకు సిద్ధ‌మైంది. Also read: India vs Australia: భారత క్రికెటర్లకు జరిమానా విధించిన ఐసీసీ

ఇరు జట్ల క్రీడాకారులు
భార‌త్ టీం:  శిఖ‌ర్ ధావ‌న్, మ‌యాంక్ అగ‌ర్వాల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్య‌ర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, న‌వ‌దీప్ సైనీ, జస్ప్రీత్ బుమ్రా, చాహ‌ల్. 

ఆస్ట్రేలియా టీం:  డేవిడ్ వార్న‌ర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), స్టీవెన్ స్మిత్, లబుచేన్‌, హెన్రిక్స్, క్యారీ, మ్యాక్స్‌వెల్‌, క‌మ్మిన్స్‌, స్టార్క్ , జంపా, హాజిల్ వుడ్, ఆడం జంపా. 

 

Trending News