IPL 2024 Schedule: ఓ వైపు లోక్‌సభ ఎన్నికలు మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఐపీఎల్ 2024 షెడ్యూల్ ఖరారు ఆలస్యమౌతోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ను బట్టి ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేసేందుకు బీసీసీఐ సిద్ధమౌతోంది. మరోవైపు రెండు దశల్లో ఐపీఎల్ నిర్వహించే పరిస్థితి కూడా లేకపోలేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 నిర్వహణకు రంగం సిద్ధమౌతోంది. లోక్‌సభ ఎన్నికల కారణంగా షెడ్యూల్ విడుదల ఆలస్యమౌతోంది. ఎన్నికలు అడ్డొచ్చే క్రమంలో ఐపీఎల్ ఇండియాలో నిర్వహించాలా లేక బయటెక్కడైనా నిర్వహించాలా అనే కోణంలో ఆలోచన చేస్తోంది బీసీసీఐ. మార్చ్ 22 నుంచి ఐపీఎల్ నిర్వహించాలనే ఆలోచన కూడా కన్పిస్తోంది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక కచ్చితమైన తేదీ ప్రకటించవచ్చు.
ఒకవేళ ఎన్నికల తేదీ ప్రకటన ఇంకా ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటే మాత్రం ఐపీఎల్ షెడ్యూల్ దశలవారీగా ఉంటుంది. సాధ్యమైనంతవరకూ ఐపీఎల్ ఇండియాలోనే నిర్వహించాలనేది బీసీసీఐతో పాటు అందరి ఆలోచన. అందుకే ప్రత్యామ్నాయంగా దశలవారీగా ఐపీఎల్ నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చింది. ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఎన్నికలకు అడ్డు రాకుండా ఉండేందుకు ఫిబ్రవరిలో తొలి దశ షెడ్యూల్ విడుదల చేసేందుకు బీసీసీఐ యోచిస్తోంది. ఒకవేళ ఇండియా వెలుపలే నిర్వహించాలనుకుంటే యూఏఈలో నిర్వహించవచ్చు. గతంలో 2009లో ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. 2014లో తొలి దశ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించారు.
ఈసారి కూడా యూఏఈలో నిర్వహించే ఆలోచన లేకపోలేదు. ఎన్నికలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు దశల వారీ జరిపితే ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చనే వాదన విన్పిస్తోంది. అదే జరిగితే ఫిబ్రవరిలోనే ఐపీఎల్ 2024 ప్రారంభం కావచ్చు.వాస్తవానికైతే మార్చ్ 22 నుంచి ప్రారంభమై మే 26 వరకూ కొనసాగనుంది. కానీ ఎన్నికల కారణంగా పాత షెడ్యూల్ మారనుంది.
Also read: India vs England: ఎంత పనిచేశావ్ భరత్ బ్రో.. అది ఔటే.. బుమ్రా కోపం చూశారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook