R Ashwin one wicket away to complete 450 Wickets in Tests: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 ప్రారంభం కానుంది. రేపు ఆరంభం అయ్యే తొలి టెస్టుకు నాగ్‌పుర్‌లోని వీసీఏ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. స్టార్ ప్లేయర్స్ సత్తాచాటాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ సిరీస్ గెలిస్తే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్స్‌లో భారత్ చోటు దక్కించుకోవచ్చు. దీంతో క్రికెట్ అభిమానుల దృష్టి అంతా ఇప్పుడుతొలి టెస్ట్ మ్యాచ్‌పైనే ఉంది. నాగ్‌పుర్ టెస్టులో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన మైలురాయి అందుకునే అవకాశముంది.
అరుదైన క్లబ్‌లో చేరేందుకు ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ ఒకేఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. నాగ్‌పుర్ టెస్టులో అశ్విన్ ఒక్క వికెట్ తీసుకుంటే.. టెస్టుల్లో 450 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 450 వికెట్లు మైలురాయిని అందుకున్న 9వ బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. ఇక భారత్ తరఫున టెస్టుల్లో 450 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గానూ అశ్విన్ రికార్డు సృష్టిస్తాడు. ఈ జాబితాలో భారత లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (619) మొదటి స్థానంలో ఉన్నాడు.
టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. మురళీధరన్ టెస్టుల్లో 800 వికెట్స్ పడగొట్టాడు. ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్ (708), ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ (675), భారత దిగ్గజం అనిల్ కుంబ్లే (619), ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (566) టాప్ 5లో ఉన్నారు. ఈ జాబితాలో మెక్ గ్రాత్ (563), కోట్నీ వాల్ష్ (519), నాథన్ లైయన్ (460) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 లో ఆర్ అశ్విన్ మరో ఏడు వికెట్లు పడగొడితే.. టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (95) రికార్డును బద్దలు కొడతాడు. 7 వికెట్లు తీస్తే హర్భజన్‌ని అధిగమించి టెస్టుల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా యాష్ నిలుస్తాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే (111) మొదటి స్థానంలో ఉన్నాడు. అశ్విన్ ఇప్పటివరకు 88 టెస్టులు ఆడి.. 3043 రన్స్, 449 వికెట్స్ పడగొట్టాడు.
Also Read: Rishabh Pant Accident: రిషబ్ పంత్‌ను గట్టిగా పీకాలనుంది.. కపిల్ దేవ్ ఆగ్రహం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.