ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం చేసింది. ప్రత్యర్థి ముంబయి ఇండియన్స్‌ని ఖంగు తినిపించి బోణీ కొట్టింది. టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ చేయడానికి నిర్ణయించుకున్న ఎల్లో టీమ్‌ను ముంబయి దిగ్గజాలు బాగానే ఎదుర్కొన్నారు. నాలుగు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ (40 పరుగులు), సూర్య కుమార్ యాదవ్ (43 పరుగులు) చెలరేగి ఆడగా.. హార్దిక్ పాండ్య ( 22 పరుగులు), క్రునాల్ పాండ్య (41 పరుగులు) కూడా ఆఖరిలో చెలరేగడంతో ముంబయి ఇండియన్స్ చెప్పుకోదగ్గ స్కోరు చేసింది.
తర్వాత బ్యాటింగ్ చేయడానికి బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో షేన్ వాట్సన్ (16 పరుగులు), అంబటి రాయుడు (22 పరుగులు) ఇద్దరూ అవుటయ్యాక.. గేమ్ స్లోగా మారింది. అలాంటి సమయంలో బ్రేవో (68 పరుగులు) దుమ్ము లేపాడు. కేదార్ జాదవ్ (24 పరుగులు) కూడా విజయానికి తోడ్పడ్డాడు. ఈ మ్యాచ్‌లో అంబటి రాయుడు "క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు అందుకోగా.. బ్రేవో "సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది అవార్డు" అందుకున్నాడు. కేదార్ జాదవ్ ఉత్తమ కొత్త ఆటగాడి అవార్డు అందుకోగా.. సూర్య కుమార్ యాదవ్ "స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు అందుకున్నాడు. అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును బ్రేవో అందుకున్నాడు.
One true spirit of the #Champion is #NeverGiveUp. That's what Bravo is made of! #WhistlePodu #CSKisTheBest #CSK #Yellove #CSKvsMI🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) April 7, 2018