Commonwealth Games 2022: ఒత్తిడి లేకుండా ఆడండి.. సంబరాలు చేసుకుందాం! భారత అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని

PM Narendra Modi Interacts With CWG 2022 Athletes. కామన్వెల్త్  గేమ్స్‌ 2022లో పాల్గొనే భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు వర్చువల్‌ సమావేశం నిర్వహించి మాట్లాడారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 20, 2022, 03:39 PM IST
  • ఒత్తిడి లేకుండా ఆడండి
  • సంబరాలు చేసుకుందాం
  • భారత అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని
Commonwealth Games 2022: ఒత్తిడి లేకుండా ఆడండి.. సంబరాలు చేసుకుందాం! భారత అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని

PM Narendra Modi Interacts With CWG 2022 Athletes: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ 2022కి సమయం దగ్గరపడుతోంది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు గేమ్స్ జరగనున్నాయి. ఇప్పటికే 322 మంది సభ్యులతో కూడిన జంబో జట్టును భారత ఒలింపిక్స్ సంఘం ఎంపిక చేసింది. ఇందులో 215 మంది అథ్లెట్లు.. 107 మంది అధికారులు, సహాయక సిబ్బంది ఉన్నారు. 215 మంది అథ్లెట్లు 19 క్రీడా విభాగాలలో భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ సందర్భంగా కామన్వెల్త్  గేమ్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు వర్చువల్‌ సమావేశం నిర్వహించి మాట్లాడారు. 

కామన్వెల్త్ గేమ్స్ 2022లో పాల్గొనే భారత అథ్లెట్లకు తన మాటలతో ప్రధాని మోదీ స్పూర్తి నింపారు. 'భారత దేశం మూలమూలన క్రీడా ప్రతిభతో నిండి ఉంది. దేశంలో క్రీడల కొత్త శకం మొదలైంది. కామన్వెల్త్ గేమ్స్ 2022కి వెళ్లే వారందరికి నా శుభాకాంక్షలు. నయా భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నామనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఒత్తిడి లేకుండా బాగా ఆడండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. విజయాలతో రాగానే సంబరాలు జరుపుకుందాం' అని మోదీ అన్నారు.  

కామన్వెల్త్ గేమ్స్ 2022లో షూటింగ్‌ లేకపోవడం భారత అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. అయితే బాస్కెట్‌బాల్‌ 3×3, వీల్‌ ఛైర్‌ బాస్కెట్‌బాల్‌, పారా టేబుల్‌ టెన్నిస్‌, మహిళల క్రికెట్‌ ఉండడం సంతోషించాల్సిన విషయం. కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల క్రికెట్‌ భాగం కావడం ఇదే తొలిసారి. ఈ టోర్నీకి ఎనిమిది జట్లు సెలక్ట్ కాగా.. గ్రూప్‌-ఎలో భారత్ ఉంది. పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, బార్బడోస్‌లతో కలిసి భారత్ గ్రూప్‌-ఎలో భాగమైంది. 29న ఆస్ట్రేలియాతో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడుతుంది. ఆగస్టు 7న ఫైనల్‌ జరుగుతుంది.

Also Read: Ram Gopal Varma: వాళ్ళ అంతు చూస్తా.. వదిలేదే లేదంటూ సీరియస్ వార్నింగ్

Also Read: Virat Kohli: 20 నిమిషాల టైమ్ ఇస్తే.. విరాట్ కోహ్లీ సమస్య పరిష్కరిస్తా: గవాస్కర్

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News