David Warner slams SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై డేవిడ్ వార్నర్ ఫైర్

David Warner slams SRH, IPL 2021 live updates: ఐపిఎల్ 2021 సీజన్‌లో (IPL 2021 season) సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్తిగా విఫలమైన అనంతరం మంగళవారం హైదరాబాద్ ఫ్రాంచైజీని ఉద్దేశించి డేవిడ్ వార్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు క్రికెట్ వర్గాల్లో, ఇటు క్రికెట్ ప్రియుల్లో చర్చనియాంశమయ్యాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2021, 11:18 PM IST
David Warner slams SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై డేవిడ్ వార్నర్ ఫైర్

David Warner slams SRH, IPL 2021 live updates: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ యాజమాన్యంపై ఆ జట్టు మాజీ కెప్టేన్ డేవిడ్ వార్నర్ ఫైర్ అయ్యాడు. తనను సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు కెప్టేన్సీ బాధ్యతల నుంచి ఎందుకు తొలగించింది అనేందుకు యాజమాన్యం సరైన కారణాలు కూడా వెల్లడించలేదని వార్నర్ ఆరోపించాడు. ఐపిఎల్ 2021 సీజన్‌లో (IPL 2021 season) సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్తిగా విఫలమైన అనంతరం మంగళవారం హైదరాబాద్ ఫ్రాంచైజీని ఉద్దేశించి డేవిడ్ వార్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు క్రికెట్ వర్గాల్లో, ఇటు క్రికెట్ ప్రియుల్లో చర్చనియాంశమయ్యాయి. 

ఐపిఎల్ 2021 సీజన్ తొలి షెడ్యూల్లో భారత్‌లో ఆడిన ఆరు మ్యాచుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదు మ్యాచ్‌లు ఓటమిపాలైంది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు ఫ్రాంచైజీ కెప్టేన్‌గా డేవిడ్ వార్నర్‌ని తప్పించి న్యూజిలాండర్ కేన్ విలియంసన్‌కి (Kane Williamson) ఆ బాధ్యతలు అప్పగించింది.  

సీన్ కట్ చేస్తే.. దుబాయ్‌లో జరిగిన తాజా షెడ్యూల్లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ తల రాత ఏమాత్రం మారలేదు. చివరకు ఐపిఎల్ 2021 పాయింట్స్ పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad in IPL 2021) అట్టడుగునే ఉండిపోవాల్సి వచ్చింది. దుబాయ్ షెడ్యూల్లో డేవిడ్ వార్నర్‌కి పలు మ్యాచుల్లో జట్టులో ఆడే అవకాశం కూడా లభించలేదు. కెప్టేన్సీ బాధ్యతల నుంచి తప్పించడం, ఆటగాడిగానూ అవకాశం ఇవ్వకపోవడం వంటివి డేవిడ్ వార్నర్‌ని తీవ్రంగా కలిచివేశాయని తాజాగా అతడు చేసిన వ్యాఖ్యలే చెబుతున్నాయి.  

Also read : Virat Kohli Crying Video:ఏడ్చేసిన కోహ్లీ & డివిలియర్స్‌..ఇంటర్నెట్ లో వైరలైన వీడియో

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కోసం 100 కు పైగా మ్యాచ్‌లు ఆడిన నేను ఈ సీజన్‌లో జరిగిన ఐదు మ్యాచుల్లో తొలి నాలుగు మ్యాచులు సరిగ్గా ఆడలేకపోయాను. అంతమాత్రానికే నాపై ఎలా ఒక నిర్ణయానికి వస్తారని డేవిడ్ వార్నర్ (David Warner) ఆవేదన వ్యక్తంచేశాడు. అన్నింటికిమించి కారణం కూడా చెప్పకుండానే తనను కెప్టేన్‌గా పక్కకు పెట్టడం అనేది ఏ మాత్రం మింగుడుపడలేదన్నాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీపై ఆగ్రహం వ్యక్తంచేసిన డేవిడ్ వార్నర్ (Sunrisers Hyderabad).. అదే సమయంలో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించడానికి ఇప్పటికీ తాను సుముఖంగానే ఉన్నప్పటికీ, ఆ అవకాశం రావడం, రాకపోవడం అనేది తన చేతుల్లో లేదని అనుమానం వ్యక్తంచేశాడు.

Also read : IPL 2021: ఆర్సీబీ బౌలర్ హర్షల్‌ పటేల్‌ నయా రికార్డు

Also read : KKR vs RCB match highlights: బెంగళూరును ఓడించిన కోల్‌కతా.. కోహ్లీ సేన నడ్డి విరిచిన Sunil Narine

Also read : ICC Player Of Month: ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా నేపాల్‌ క్రికెటర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News