ECB: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. భద్రతా సమస్యల కారణంగా ఈ రెండు జట్లు పాక్ పర్యటన(Pak Tour)ను రద్దు చేసుకున్నాయి. అయితే పాక్ పర్యటనను ఇంగ్లండ్ రద్దు చేసుకోవడంపై ఆ జట్టు క్రికెట్ బోర్డుపై పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలో స్పందించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఛీప్ ఇయాన్ వాట్మోర్(ECB chief Ian Watmore) క్షమాపణలు తెలిపారు. కాగా వచ్చే ఏడాది తమ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తుందని ఆయన మాటిచ్చారు.
"తమ నిర్ణయంతో పాకిస్తాన్ బాధపడినందకు నేను చింతిస్తున్నాను. బోర్డు తీసుకున్న నిర్ణయం చాలా క్లిష్టమైనది. మా ఆటగాళ్లు, సిబ్బంది సంక్షేమం, మానసిక ఆరోగ్యం గురించి ఆలోచించి బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది పాకిస్తాన్ పర్యటన కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ECB) ఎదురుచూస్తోంది ”అని వాట్మోర్ డైలీ మెయిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా చెప్పారు.
Also read: Viral videos: ఇయాన్ మోర్గాన్‌తో Ravichandran వాగ్వాదం.. సర్దిచెప్పిన Dinesh Karthik
అయితే ఈసీబీ ఛీప్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ సమాచార ప్రసార మంత్రి ఫవాద్ చౌదరి ముక్తకంఠంతో స్వాగతించారు. "వచ్చే ఏడాది పాకిస్తాన్ పర్యటనకు ఇంగ్లండ్ రాబోతుందని ప్రకటించడం చాలా సంతోషకరం. పాకిస్థాన్ క్రికెట్(PCB)కు మద్దతుగా నిలిచిన ప్రపంచంలోని మాజీ క్రికెటర్లకు, మీడియా, క్రికెట్ అభిమానులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా''. అని ఆయన ట్వీట్ చేశారు.
Announcement of ECB to visit Pakistan next year is a welcome step,I would like to thank stars of cricket world, diplomatic community, Media And Cricket lovers around the world on their support for pakistan Cricket, yet again Pak has emerged as strong and resilient nation
— Ch Fawad Hussain (@fawadchaudhry) September 29, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి