Rohit Sharma breaks World Record in T20 format: ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు బోణీ కొట్టింది. గురువారం రాత్రి ముగిసిన తొలిటీ20 మ్యాచులో భారత్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 199 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది. స్టార్ ప్లేయర్స్ విఫలమయిన చోట మోయిన్ అలీ (36; 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హరీ బ్రూక్ (28; 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చహల్, అర్శ్‌దీప్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఈ విజయంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. పొట్టి ఫార్మాట్‌లో వరుసగా 13 విజయాలు అందుకున్న తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఏ కెప్టెన్‌కూ లేని ట్రాక్ రికార్డ్ రోహిత్ తన పేరుపై లిఖించుకున్నాడు.రోహిత్ సారథ్యంలో ఇప్పటివరకు 29 టీ20 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన భారత్.. ఏకంగా 25 మ్యాచ్‌లల్లో విజయం సాధించింది. కేవలం నాలుగింట్లో మాత్రమే ఓడింది. రోహిత్ సక్సెస్ ట్రాక్ రికార్డ్ 86.20 శాతంగా ఉండడం విశేషం.
టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత విరాట్ కోహ్లీ నుంచి టీమిండియా పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంకతో జరిగిన సిరీస్‌లను హిట్‌మ్యాన్ సారథ్యంలోని భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. అంతకుముందు బంగ్లాదేశ్‌పై రెండు మ్యాచులు గెలిచిన భారత్.. తాజాగా ఇంగ్లండ్‌పై తొలి టీ20 మ్యాచులో విజయం సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదుసార్లు టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే.
🚨 Milestone Alert 🚨
First captain to win 1⃣3⃣ successive T20Is - Congratulations, @ImRo45. 👏 👏#TeamIndia | #ENGvIND pic.twitter.com/izEGfIfFTn
— BCCI (@BCCI) July 7, 2022
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా పూర్తిస్థాయి కెప్టెన్‌గా తొలిసారి విదేశీ గడ్డపై భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 14 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేశాడు. రీషెడ్యూల్డ్ టెస్టుకు ముందు కరోనా మహమ్మారి బారిన పడ్డ రోహిత్.. కోలుకుని ఇంగ్లండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 198 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 51; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకం బాదాడు.
Also Read: Heavy Rains: గోడ కూలి తల్లి, కూతురు మృతి.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్ష బీభత్సం
Also Read: Bhadli Navami 2022: ఈ రోజున ముహూర్తం చూడకుండా పెళ్లి చేసుకోవచ్చు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook