Michael Vaughan: ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ జట్టు ఘోర వైఫల్యం మూటగట్టుకుంటున్న నేపధ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మను టార్గెట్ చేస్తూ చేసిన ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఐపీఎల్ 2022లో టీమ్ ఇండియా రధ సారధి రోహిత్ శర్మ సారధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఘోరంగా విఫలమవుతోంది. టోర్నమెంట్ చరిత్రలో ఇంత ఘోరమైన పరాభావం మరే జట్టుకు ఎదురుకాలేదు. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుతో ఓటమితో వరుసగా ఏడు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టు కూడా వరుసగా ఏడు మ్యాచ్‌లలో ఓడిపోలేదు. అటు రోహిత్ శర్మ..ఇటు మేనేజ్‌మెంట్ కలిసి చాలా ప్రయోగాలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మేఖేల్ వాఘన్ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ ఒకవేళ ప్లేఆఫ్‌కు క్వాలిఫై కాకపోతే...రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడం మంచిదని వ్యాఖ్యానించాడు.
ఇది కేవలం ముంబై ఇండియన్స్ టీమ్ ఆపరేషన్ మాత్రమే.ఇదే ఫలితం దక్కడం లేదు. ఇంకా చాలామంది యువతకు అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. యంగస్టర్స్‌కు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో రెండు మ్యాచ్‌లు ఓడిపోతే..ఇక రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోకతప్పదని క్రిక్‌బజ్‌కు వివరించాడు మేఖేల్ వాఘన్. కాస్సేపు విశ్రాంతి తీసుకో..ఎప్పుడు బ్రేక్ తీసుకోవాలనేది నీవే నిర్ణయించుకో. ముంబై ఇండియన్స్ ఇక మరో రెండు మ్యాచ్‌లలో విజయం సాధించకపోతే ఇక అసాధ్యమేనని వాఘన్ చెప్పుకొచ్చాడు. కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండటం ద్వారా రోహిత్ శర్మ..యంగ్‌స్టర్లకు అవకాశమివ్వాలని వాఘన్ కోరాడు.
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ జట్టుతో పాటు రోహిత్ శర్మ కూడా విఫలమౌతున్నాడు. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ ఫామ్‌లో లేడు. అతని అత్యధిక స్కోరు కేవలం 41 పరుగులు మాత్రమే.
Also read: Sunrises Hyderabad ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ జైత్రయాత్ర..ఖాతాలో మరో రికార్డు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.