Sunrises Hyderabad ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ జైత్రయాత్ర..ఖాతాలో మరో రికార్డు..!

IPL SRH Wins: ఐపీఎల్‌లో హైదరాబాద్ జట్టు జోరు కొనసాగుతోంది. వరుసగా ఐదు విజయాలను నమోదు చేసి ఔరా అనిపిస్తోంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా ఓడినా జట్టు అద్భుతంగా పుంజుకుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ అద్భుతమే చేసింది. ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేయడమే కాకుండా లక్ష్యాన్ని అతి తక్కువ బంతుల్లోనే చేధించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 24, 2022, 11:00 AM IST
  • ఐపీఎల్‌లో హైదరాబాద్ జట్టు జోరు
  • అరుదైన రికార్డు నెలకొల్పిన ఎస్‌ఆర్‌హెచ్
  • ఆర్‌సీబీ మ్యాచ్‌లో ఘన విజయం
Sunrises Hyderabad ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ జైత్రయాత్ర..ఖాతాలో మరో రికార్డు..!

IPL SRH Wins: ఐపీఎల్‌లో హైదరాబాద్ జట్టు జోరు కొనసాగుతోంది. వరుసగా ఐదు విజయాలను నమోదు చేసి ఔరా అనిపిస్తోంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా ఓడినా జట్టు అద్భుతంగా పుంజుకుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ అద్భుతమే చేసింది. ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేయడమే కాకుండా లక్ష్యాన్ని అతి తక్కువ బంతుల్లోనే చేధించింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి వెళ్లింది. 10వ స్థానంలో ఉన్న జట్టు..టాప్‌లోకి వెళ్లడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. క్రికెట్ అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. 

ఐపీఎల్‌లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ విజయధుంధుంబి మోగించింది. ఈమ్యాచ్‌లో 72 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. అంటే కేవలం 8 ఓవర్లలోనే టార్గెట్‌ను చేధించింది. దీంతో విలయమ్సన్ జట్టు ఐపీఎల్‌ చరిత్రలోనే అరుదైన రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్‌లో ఎక్కువ బంతులు మిగిలి ఉండగానే విజయం అందుకున్న నాలుగో జట్టుగా ఎస్‌ఆర్‌హెచ్‌ నిలిచింది. 

తొలి స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది. 2008లో కేకేఆర్‌పై 87 బంతుల్లో విజయం సాధించింది. ఆ తర్వాత కొచ్చి జట్టు ఉంది. 2011లో ఆ జట్టు రాజస్థాన్‌పై 76 బంతుల్లో లక్ష్యాన్ని చేధించింది. 2017లో ఢిల్లీపై పంజాబ్‌ జట్టు 73 బంతుల్లో జయకేతనం ఎగురవేసి మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు నాలుగో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ఇటు ఆర్‌సీబీ ఐదో స్థానంలో ఉంది. 2018లో పంజాబ్‌ కింగ్స్‌పై 71 బంతుల్లో గెలుపు రుచిని చూసింది. 

హైదరాబాద్‌ జట్టు(SRH) తన తదుపరి మ్యాచ్‌ను ఈనెల 27న గుజరాత్‌తో తలపడనుంది. మే 1న చెన్నై, మే 5న ఢిల్లీ, మే 8న బెంగళూరు జట్లను ఢీకొట్టనుంది. ఇప్పటికే సగం మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌ 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. రన్‌రేట్‌ పరంగానూ ముందు వరుసగాలో ఉంది. ఈసీజన్‌లో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ వెల్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జోరు కొనసాగితే..టాప్‌ ప్లేస్ ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
 

Also read :PK Proposal: ఏపీలో వైసీపీ- కాంగ్రెస్ పొత్తు సాధ్యమేనా, పీకే ప్రతిపాదన జగన్‌కు తెలుసా లేదా..??

Also read :PM Visits Jammu: నేడు జమ్మూకు మోదీ.. రూ.20వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు!

Also read : Fourth Wave Alert: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే?

Trending News