former indian cricketer Vinod Kambli video goes viral: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్క్‌ర్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. 90వ దశకంలో టీమిండియా స్టార్ బ్యాటర్‌గా వినోద్ కాంబ్లీ ఒక రేంజ్ లో హల్ చల్ చేశాడు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడి అనారోగ్య సమస్య ఏంటో బైటపడలేదు. కానీ అతడు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఆయనకు సంబంధించిన తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Sad look at Vinod Kambli’s condition.look what Alcohol & high ego can do😠😠👆👆 .
But I expected @sachin_rt would come for his rescue and try to rehabilitate Vinod Kambli .@imVkohli @RaviShastriOfc @RahulDravidFC #VinodKambli @BCCI @JayShah @SGanguly99 pic.twitter.com/mqlidlKg4I— #BC🇮🇳 (@binugazi) August 6, 2024
వినోద్ కాంబ్లీ ఒక షాపు ముందు బైక్ పట్టుకుని నిలబడ్డారు. ఆయన షాపులోకి కూడా వెళ్లలేని స్థితిలో ఉన్నారు. దీంతో ఆయనను గమనించిన అక్కడి వారు.. తమ భుజాలపై కాంబ్లీని షాపుదగ్గరకు తీసుకెళ్తుంటారు. ఇదిలా ఉండగా.. వినోద్ కాంబ్లీ 2013లో తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. ఆ సమస్య నుంచి కాస్త కోలుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే అతడి పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని తాజా వీడియో రుజువు చేస్తోంది. ఆయనకు బీసీసీఐ పింఛన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. సచిన్ టెండుల్కర్, కాంబ్లీలుఇద్దరు మంచి స్నేహితులు. 1988 లో స్కూల్ నుంచి క్రికెట్ లో కాంబ్లీ, సచిన్ ఇద్దరు అనేక రికార్డులు క్రియేట్ చేశారు. వీరిద్దరు కలిసి.. హారిస్ షీల్డ్ సెమిఫైనల్స్ మ్యాచ్ లో.. 664 పరుగు పార్టనర్ షిప్ సాధించారు.
దీనిలో కాంబ్లీ 349 పరుగులు, సచిన్ 326 పరుగులు సాదించాడు. 1990 లో కాంబ్లీ ఒక వెలుగు వెలిగాడని చెప్పవచ్చు. కానీ ఆతర్వాత అనూహ్యంగా ఆయన కెరిర్ లో వెనక్కు వెళ్లిపోయారు. మరోవైపు దీనికి భిన్నంగా సచిన్ రికార్డులు క్రియేట్ చేస్తుముందుకు దూసుకుపోయారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం అందరిని కలిచివేసేదిగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి