Good News To Cricket Lovers: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020ని ( Indian Premier League 2020 ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది. ఈ మేరకు లీగ్ ప్రెసిడెంట్ బ్రిజేష్ పటేల్ ( Brijesh Patel ) సమాచారం అందించారు. ఈ ఏడాది ఐపిఎల్ 2020 ( IPL 2020 In UAE ) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఇండియన్ క్రికెట్ బోర్డు (BCCI) కు అధికారికంగా అంగీకారం తెలిపింది.
ఐపీఎల్ సీజన్ 13 ( IPL season 13 ) ఈ సారి సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు దుబాయ్ లోని షార్జాలో, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబిలో జరగనుంది. భారత్ లో కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ అధికంగా ఉండటంతో యూఏఈలో నిర్వహిస్తున్నారు.
ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు ( Emirates Cricket Board ) భారత ప్రభుత్వం లీగ్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిన విషయాన్ని తెలియజేసినట్టు బ్రిజెష్ పటేల్ తెలిపారు. తమకు రాత పూర్వకంగా అంగీకార పత్రం లభించింది అని ఈ విషయాన్ని ఐపిఎల్ ప్రాంఛైజీ టీమ్ లకు తెలుపుతాం అన్నారు. టీమ్ లు ఆగస్టు 20న బయల్దేరనున్నాయి అని..రెండు సార్లు RT PCR టెస్టులు నిర్వహిస్తాం అని పేర్కొన్నారు బ్రిజేష్ పటేల్. అయితే మరోవైపు బీసీసీఐ టైటిల్ స్పాన్సర్ కోసం వెతుకుతున్నట్టు సమాచారం.