Virat Kohli Fifty: హాఫ్ సెంచరీ బాదాడు.. అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు! ఒకే ఒక్కడు విరాట్ కోహ్లీ

GT vs RCB, IPL 2022: Virat Kohli IPL Record. ఐపీఎల్‌లో ఓ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డుల్లో నిలిచాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 06:46 PM IST
  • విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు
  • అత్యధిక హాఫ్ సెంచరీలు
  • ఒకే ఒక్కడు విరాట్ కోహ్లీ
Virat Kohli Fifty: హాఫ్ సెంచరీ బాదాడు.. అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు! ఒకే ఒక్కడు విరాట్ కోహ్లీ

Virat Kohli hits Most half centuries in IPL for a Single Team: ఐపీఎల్ 2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ అందుకున్నాడు. శనివారం సాయంత్రం ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదాడు. గుజరాత్ పేసర్ మహమ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్‌ మూడో బంతికి సింగిల్ తీసిన కోహ్లీ.. 45 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. దాంతో ఐపీఎల్ 2022లో కొనసాగిస్తున్న పేలవ ప్రదర్శనకు ముగింపు పలికాడు. 

ఐపీఎల్ టోర్నీలో 15 ఇన్నింగ్స్‌ల తర్వాత విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడం విశేషం. ఐపీఎల్ 2021 చివరి ఐదు మ్యాచుల నుంచి విరాట్ ఫిఫ్టీ బాదలేదు. ఈ హాఫ్ సెంచరీతో విరాట్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఓ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన ఆటగాడిగా కోహ్లీ రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకే ఆడుతున్న కోహ్లీ.. 42 హాఫ్ సెంచరీలు చేశాడు.

ఐపీఎల్ టోర్నీలో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదింది మాత్రం ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్. దేవ్ 53 హాఫ్ సెంచరీలు బాది అగ్రస్థానంలో ఉన్నాడు. వార్నర్ పలు ప్రాంచైజీలకు ఆడిన విషయం తెలిసిందే. టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ 46 అర్ధ సెంచరీలతో రెండో స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ మూడులో ఉన్నాడు. ఇక ఐపీఎల్ టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు విండీస్ వెటరన్ ప్లేయర్ క్రిస్ గేల్. యూనివర్సల్ బాస్ 6 శతకాలు బాదాడు. ఐదు సెంచరీలతో ఈ జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. 

ఈ మ్యాచులో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (58; 53 బంతుల్లో 6x4, 1x6), రజత్ పటీదార్ (52; 32 బంతుల్లో 5x4, 2x6) హాఫ్ సెంచరీలు బాదారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (38), మహిపాల్ లోమ్రార్ (16) బ్యాట్ ఝుళిపించారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ డకౌట్ అయ్యాడు. గుజరాత్ బౌలర్లలో ప్రదీప్ సంగ్వాన్ రెండు వికెట్లు తీశాడు. మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్, లోకీ ఫెర్గూసన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

Also Read: Snake Yoga Video: ప్రాణాయామం చేస్తున్న కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్మడం పక్కా!

Also Read: Funny Video: అసలే సమ్మర్, ఆపై విద్యుత్ కోతలు.. ఉక్కపోత తట్టుకోలేక ఈ వ్యక్తి ఏం చేశాడో చుడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News