AP Schools Summer Holidays: ఆంధ్రప్రదేశ్‌లో నేటితో సమ్మర్ హాలీ డేస్ ముగిసిపోనున్నాయి. సోమవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. అయితే రాష్ట్రంలో భానుడి ప్రతాప ఇంకా తగ్గడం లేదు. ప్రతి రోజు అధిక ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలు ఓపెన్ చేస్తే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని.. ఒంటి పూట బడులు నిర్వహించాలని అన్ని వైపులా నుంచి డిమాండ్ వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా సీఎం జగన్‌కు లేఖ రాశారు. పాఠశాలల పునఃప్రారంభాన్ని వాయిదా వేయాలని లేదంటే ఒక పూట స్కూల్స్ నిర్వహించాలని కోరిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి యథావిధిగా స్కూల్స్ ప్రారంభం అవుతాయని.. అయితే ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. వడగాల్పులు, తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ వరకు ఉ.7.30 నుంచి మ.11.30 వరకు తరగతులు నిర్వహిస్తామని ప్రకటించింది. ఉ.8.30-9 మధ్య రాగి జావ, ఉ.11.30-మ.12 మధ్య భోజనం పెడతారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు ఈ నిబంధన వర్తించనుంది. జూన్ 19 నుంచి బడులు పూర్తిస్థాయిలో నడుస్తాయని ప్రభుత్వం తెలిపింది.
Also Read: Asia Cup 2023: హైబ్రిడ్ మోడల్‌లో ఆసియా కప్ 2023.. భారత్ మ్యాచ్‌లు ఎక్కడంటే..?
రాష్ట్రంలో మరో రెండు రోజులు వడగాల్పులు ప్రభావం చూపనున్నాయి. ఆదివారం 50 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు. సోమవారం 100 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 119 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
Also Read: Jasprit Bumrah Comback: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. బుమ్రా రీఎంట్రీకి రెడీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook