Harbhajan Singh: ఫ్యాన్స్‌కు హర్భజన్ సింగ్ శుభవార్త, భల్లే భల్లే అంటున్న ఫ్యామిలీ

Harbhajan Singh blessed with a baby boy: హర్భజన్, గీతా బస్రా దంపతులు రెండో పర్యాయం తల్లిదండ్రులయ్యారు. గీతా బస్రా ఓ పండంటి బాబుకు జన్మనిచ్చిందని భజ్జీ తెలిపాడు. ఈ మేరకు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో భావోద్వేగంతో ఓ సందేహాన్ని షేర్ చేసుకున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 11, 2021, 08:40 AM IST
Harbhajan Singh: ఫ్యాన్స్‌కు హర్భజన్ సింగ్ శుభవార్త, భల్లే భల్లే అంటున్న ఫ్యామిలీ

Harbhajan Singh and Geeta Basra blessed with a baby boy: టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ తన అభిమానులకు, మద్దతుదారులకు శుభవార్త చెప్పాడు. హర్భజన్, గీతా బస్రా దంపతులు రెండో పర్యాయం తల్లిదండ్రులయ్యారు. హర్భజన్ సింగ్ భార్య గీతా బస్రా ఓ పండంటి బాబు(Harbhajan Singh blessed with a baby boy)కు జన్మనిచ్చింది.

హర్భజన్, గీతా బస్రా దంపతులకు 2016లో వీరికి సంతానంగా ఓ పాప జన్మించింది. హినయ హీర్ ప్లాహా సైతం తనకు తమ్ముడు పుట్టాడని సంతోషంగా ఉంది. గీతా బస్రా ఓ పండంటి బాబుకు జన్మనిచ్చిందని భజ్జీ తెలిపాడు. ఈ మేరకు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో భావోద్వేగంతో ఓ సందేశాన్ని Harbhajan Singh షేర్ చేసుకున్నాడు. మేం పట్టుకోవడానికి మరో చిన్ని చేతులు మాకు అందాయి. బుజ్జాయి ఇంట్లోకి రావడంతో మేం చాలా సంతోషంగా ఉన్నాము. మా జీవితంలో అద్భుతమైన బహుమతి పొందాం. మా మనసులో ఆనందంతో బరువెక్కాయి. మా జీవితం ఇప్పుడు పూర్తి అయిన భావన కలుగుతుంది. గీతా బస్రా, బాబు ఆరోగ్యంగా ఉన్నారు. మాపై ప్రేమ చూపుతూ, మద్దతుగా నిలుస్తున్న శ్రేయోభిలాషులు, అభిమానులకు ధన్యవాదాలు అని ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు.

అక్టోబర్ 29, 2015లో నటి గీతా బస్రాను టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహం చేసుకున్నాడు. కెరీర్ విషయానికొస్తే టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ సాధించిన టీమిండియా (Team India)లో హర్భజన్ సభ్యుడుగా ఉన్నాడు. చివరగా 2016లో జాతీయ జట్టుకు మ్యాచ్ ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో దాదాపు పదేళ్లపాటు ముంబై ఇండియన్స్‌కు భజ్జీ ప్రాతినిథ్యం వహించాడు. 

ఆపై చెన్నై సూపర్ కింగ్స్‌కు సేవలు అందించాడు. రెండు పర్యాయాలు ఐపీఎల్ ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) తరఫున ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. యూఏఈలో జరగనున్న ఐపీఎల్ 2021 మిగతా మ్యాచ్‌లలో హర్భజన్ పాల్గొనున్నాడు. మరోసారి జాతీయ జట్టుకు ఆడాలని తాపత్రయపడుతున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News