Five Must Watch Matches in ICC World Cup 2023: ప్రపంచకప్ 2023 షెడ్యూల్ వచ్చేయడంతో అసలు పోరు కోసం అభిమానుల నిరీక్షణ మొదలైంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య అక్టోబర్ 5న తొలి మ్యాచ్ జరగనుండగా.. నవంబర్ 19న ఫైనల్ పోరు జరగనుంది. మొదటి.. చివరి మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికకానుంది. మరో 100 రోజుల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. 2019లో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఇంగ్లాండ్ తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈసారి సొంతగడ్డపై మెగా టోర్నీ జరుగుతుండడంతో టీమిండియా హాట్ ఫేవరేట్‌గా రంగంలోకి దిగుతోంది. ఈసారి గ్రూప్ దశలో కచ్చితంగా వీక్షించాల్సిన ఐదు మ్యాచ్‌లను ఓసారి పరిశీలిద్దాం..
భారత్ Vs పాకిస్థాన్
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా భారీ క్రేజ్ ఉంటుంది. ఇక ప్రపంచకప్‌లో రెండు జట్ల మధ్య పోరు అంటే.. అభిమానులకు పూనకాలే. అక్టోబర్ 15వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం రెండు జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది. వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమిండియాదే పైచేయి. చివరి వరల్డ్‌కప్‌లో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ శతకంతో చెలగరేడంతో భారత్ 89 పరుగుల (DLS పద్ధతి) తేడాతో పాక్‌ను ఓడించింది. ఈ ప్రపంచకప్‌లో భారీ హై బజ్ ఉన్న మ్యాచ్ ఇదే.
ఇంగ్లాండ్ Vs న్యూజిలాండ్
2019 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా పోరు జరిగింది. చివరికి మ్యాచ్‌లో ఎక్కువ సిక్సర్లు బాదిన జట్టు ఇంగ్లాండ్ కావడంతో వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. ఈసారి న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకోవాలని బరిలోకి దిగుతోంది. అక్టోబర్ 5న తొలి మ్యాచ్‌లో రెండు జట్లు తలపడనున్నాయి.
భారత్ Vs ఆస్ట్రేలియా
అత్యధికసార్లు ప్రపంచకప్ సాధించిన జట్టు ఆస్ట్రేలియా (ఐదుసార్లు). దైపాక్షిక సిరీస్‌లు, ఇతర మ్యాచ్‌లలో ఒక రీతిలో ఆడితే.. ప్రపంచకప్ మ్యాచ్‌లలో మాత్రం కంగారూ ప్లేయర్లు మరో లెవల్లో ఆడతారు. అక్టోబర్ 8న ఆసీస్ జరిగే పోరుతో భారత్ వరల్డ్ కప్ వేట మొదలవుతుంది. ఇటీవల డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని కసితో ఉంది.
ఆస్ట్రేలియా Vs దక్షిణాఫ్రికా
2019 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే గెలుపొందింది. మాంచెస్టర్‌లో ఆస్ట్రేలియాను ఓడించి వరల్డ్ కప్ ప్రయాణాన్ని ముగించింది. ఆ మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ సెంచరీతో చెలరేగాడు. ఈసారి అక్టోబర్ 13న రెండు జట్ల మధ్య పోరు జరగనుంది. కగిసో రబడ, అన్రిచ్ నోకియా, లుంగి ఎంగిడిలతో ప్రోటీస్ జట్టు ఈసారి బౌలింగ్ విభాగంలో బలంగా కనిపిస్తోంది.
బంగ్లాదేశ్ Vs ఆఫ్ఘనిస్తాన్
బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ చిన్న జట్లే అయినా.. పోరు మాత్రం ఆసక్తికరంగా ఉండనుంది. బౌలింగ్ ప్రధానం అస్త్రంగా ఆఫ్ఘనిస్తాన్ బరిలోకి దిగుతోంది. రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్‌హాక్ ఫరూఖీలతో బలంగా ఉంది. ఈ వరల్డ్ కప్‌లో తనదైన ముద్రవేసేందుకు బంగ్లాదేశ్ ఎదురుచూస్తోంది.
Also Read: World Cup 2023 Schedule: వరల్డ్ ఫైనల్, సెమీ ఫైనల్స్ వేదికలు ఫిక్స్..! ఎక్కడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook