Ravichandran Ashwin eye on Harbhajan Singh Test Wickets Record vs Australia: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్టు ఆరంభం కానుంది. న్యూజీలాండ్ టీ20 సిరీస్ సందర్భంగా విశ్రాంతి తీసుకున్న భారత స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, మొహ్మద్ షమీ జట్టుతో కలిశారు. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా మారింది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా పటిష్టంగానే ఉంది. దాంతో బోర్డర్-గవాస్కర్ సిరీస్ హోరాహోరీగా సాగనుంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. తొలి టెస్టులో లేదా సిరీస్ ముగిసేలోపు అశ్విన్ ఏడు వికెట్లు పడగొడితే.. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా నిలుస్తాడు. ఈ క్రమంలో భారత ఆఫ్ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ రికార్డును యాష్ అధిగిమిస్తాడు. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో హర్భజన్ 95 వికెట్స్ తీశాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై 18 టెస్టులు ఆడిన అశ్విన్.. 89 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (111) తొలి స్థానంలో ఉన్నాడు.
ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా ప్రస్తుతం ఆర్ అశ్విన్ ఉన్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (79), స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా (63) టాప్-5లో ఉన్నారు. అశ్విన్ మరో 23 వికెట్లు పడగొడితే అనిల్ కుంబ్లే రికార్డును కూడా బ్రేక్ చేస్తాడు. స్పిన్ పిచులు కాబట్టి ఈ రికార్డును యాష్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 36 ఏళ్ల అశ్విన్ ఇప్పటివరకు 88 టెస్టులు ఆడి 3043 రన్స్, 449 వికెట్స్ పడగొట్టాడు.
లెఫ్ట్ హ్యాండర్లను ఆర్ అశ్విన్ కంగారు పెడతాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాకు ఇదే భయం పట్టుకుంది. స్పిన్ పిచ్‌లపై కంగారూలు తడబడతారనే అపవాదు ఎప్పటినుంచో ఉంది. ఇక ఆసీస్ జట్టులో కీలకమైన లెఫ్ట్ హ్యాండర్లు ముగ్గురు ఉన్నారు. దాంతో ఆసీస్ భయపడుతుంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో అశ్విన్ 18 టెస్టు మ్యాచ్‌లు ఆడి 89 వికెట్లు తీశాడు. ఇందులో 5 వికెట్లు 5 సార్లు, 10 వికెట్లు ఒకసారి ఉంది. స్వదేశంలో 50 వికెట్లు తీయగా.. ఆసీస్ గడ్డ మీద 39 వికెట్లు పడగొట్టాడు. ఈ లెక్కలు చూస్తే ఆసీస్ భయపడటంలో తప్పేమీ లేదు.
Also Read: KL Rahul Playing XI: టీమిండియా ప్లేయింగ్ 11 లీక్.. తొలి టెస్టులో బరిలోకి దిగే తుది జట్టు ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.