India Vs England Full Highlights: రెండో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీకి తోడు జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో మెరుపులు మెరిపించడంతో భారత్ 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. 332 పరుగుల లోటుతో నాలుగో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్.. 292 పరుగులకు ఆలౌట్ అయింది. జాక్ క్రాలే (73) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయారు. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లతో చెలరేగిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు లభించింది. ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో భారత్ మూడో టెస్టు మ్యాచ్‌లో తలపడనుంది.
67 పరుగులకు ఒక వికెట్ నష్టంతో నాలుగో రోజు ఆరంభించిన ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే అశ్విన్ ఇబ్బందిపెట్టాడు. రెహాన్ (23)ను చేసి వికెట్ పతానికి అక్షర్ పటేల్ శ్రీకారం చుట్టగా.. ఓలీ పోప్ (23), జో రూట్ (16)ను అశ్విన్ పెవిలియన్‌కు పంపించాడు. కాసేపు క్రీజ్‌లో కుదురుకున్నట్లే కనిపించిన బెయిర్ స్టో (26).. స్లిప్‌లో రోహిత్ శర్మ పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో ఔట్ అయ్యాడు. జాక్ క్రాలేను కుల్దీప్ యాదవ్ ఔట్ చేసి ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లాడు.
దీంతో 194 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ కష్టాల్లో పడగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దాదాపు 10 ఓవర్లపాటు వికెట్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే అనవసర పరుగుకు యత్నించి బెన్ స్టోక్స్ (11) రనౌట అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ సూపర్ త్రో చేయడంతో స్టోక్స్ పెవిలియన్ బాటపట్టాల్సి వచ్చింది. ఆ తరువాత ఫోక్స్ (36), హార్ట్‌లీ (36) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుని.. ఓటమి అంతరాన్ని తగ్గించారు. 8వ వికెట్‌కు 55 పరుగులు జోడించారు. చివరకు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 292 పరుగుల వద్ద ముగిసింది. అశ్విన్, బుమ్రా, చెరో మూడు వికెట్లు తీయగా.. కుల్‌దీప్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
Also Read: Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter