KS Bharat to replace KL Rahul in IND vs NZ 1st ODI 2023: స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్.. మరో కీలక సమరానికి సిద్దమైంది. స్వదేశంలో న్యూజిలాండ్‌లో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఇరు జట్ల మధ్య ముందుగా వన్డే సిరీస్ జరగనుంది. వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో బుధవారం (జనవరి 18) మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం కానుంది. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఈ ఫార్మాట్‌పై బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. మెగా టోర్నీని దృష్టిలో పెట్టుకుని అన్ని వన్డేల్లోనూ బలమైన జట్టునే ఎంపిక చేస్తోంది. ఈ నేపథ్యంలో కివీస్‌తో తొలి వన్డే ఆడే భారత తుది ఆజట్టుని ఓసారి పరిశీలిద్దాం.
మొదటి వన్డేలో తుది జట్టు ఎంపిక కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ వ్యక్తిగత కారణాలతో కివీస్ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో రాహుల్ స్థానంలో ఎవరు తుది జట్టులోకి వస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది . డబుల్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ (Ishan Kishan) జట్టులోకి వస్తారని అందరూ అనుకుంటారు. అయితే ఇషాన్ ఓపెనర్ ప్లేయర్. వన్డేలలో రాహుల్ ఆడే ఐదవ స్థానానికి ఇషాన్ సరిపోడు. ఓపెనర్‌గా శుబ్‌మాన్ గిల్ (Shubman Gill) బాగా రాణిస్తున్నాడు. దాంతో అతడిని తప్పించే అవకాశం లేదు.
సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఐదవ స్థానంలో ఆడితే వికెట్ కీపర్ కొరత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ స్థానంలో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ అక్షర్ పటేట్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఆడే అవకాశం ఉంది. శ్రీలంకపై వన్డే సిరీస్‌లో అదరగొట్టిన మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులో కొనసాగే అవకాశం ఉంది. దాంతో యుజ్వేంద్ర చహల్ బెంచ్‌పై ఉండాల్సిందే. మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ పేస్ విభాగంలో ఆడతారు.
భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.
Also Read: NTR Team India: ఎన్టీఆర్‌ను కలిసిన టీమిండియా ప్లేయర్స్.. 'నాటు నాటు' పాటను మెచ్చిన సూర్యకుమార్!
Also Read: Maruti Suzuki Cars: కొత్త కారు కొనే వారికి భారీ షాక్.. ఆల్టో నుంచి బ్రెజా వరకు పెరిగిన ధరలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.