IND vs PAK: ఒత్తిడిలో ఎలా ఆడాలో విరాట్ కోహ్లీ నేర్పుతాడు: రిషబ్ పంత్

Virat Kohli experience is helpful in dealing with pressure situations says Rishabh Pant. ఒత్తిడితో ఎలా ఆడాలో విరాట్ కోహ్లీ నేర్పుతాడు అని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తెలిపాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Oct 20, 2022, 03:31 PM IST
  • ఆదివారం భారత్‌, పాకిస్తాన్ మ్యాచ్‌
  • ఒత్తిడిలో ఎలా ఆడాలో కోహ్లీ నేర్పుతాడు
  • పాక్‌తో మ్యాచ్‌ ఎప్పుడూ ప్రత్యేకమే
IND vs PAK: ఒత్తిడిలో ఎలా ఆడాలో విరాట్ కోహ్లీ నేర్పుతాడు: రిషబ్ పంత్

Rishabh Pant Says I enjoys batting with Virat Kohli: ఒత్తిడితో ఎలా ఆడాలో విరాట్ కోహ్లీ నేర్పుతాడు అని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తెలిపాడు. పాక్‌తో మ్యాచ్‌ ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుందన్నాడు. భారత్‌, పాకిస్తాన్ మ్యాచ్‌ అంటేనే భావోద్వేగాల సమాహారమని, ఆటగాళ్లతో పాటు అభిమానులందరూ ఎమోషనల్‌గా ఉంటారని పంత్ చెప్పాడు. టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా ఆదివారం భారత్‌, పాకిస్తాన్ మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్‌ వెబ్‌సైట్‌ పంత్‌ను ఇంటర్వ్యూ చేసింది. 

'ఆటలో ఒత్తిడితో కూడుకున్న పరిస్థితులను ఎదుర్కోవడంలో విరాట్‌ కోహ్లీ దిట్ట. అతడి అపార అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో కోహ్లీ నేర్పుతాడు. యువ ఆటగాళ్ల క్రికెట్‌ ప్రయాణానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. కోహ్లీతో బ్యాటింగ్‌ చేయడం చాలా బాగుంటుంది. కోహ్లీ వంటి అనుభవజ్ఞుడితో కలిసి బ్యాటింగ్‌ చేయడం వల్ల ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. ఆటను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఒత్తిడి పరిస్థితుల్లో బంతులను ఎదుర్కొని పరుగులుగా ఎలా చేయాలన్నది విరాట్ ఎప్పుడూ నేర్పిస్తాడు' అని రిషబ్ పంత్ చెప్పాడు. 

'టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీలో భారత్‌, పాకిస్తాన్ మ్యాచ్‌లో హసన్‌ అలీ బౌలింగ్‌లో నేను ఒకే ఓవర్‌లో రెండు సిక్సర్లు కొట్టాను. ఆ మ్యాచ్‌లో భారత్ ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో నేను, విరాట్‌ కోహ్లీ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాం. రన్‌ రేట్‌ను పెంచే ప్రయత్నం చేశాం. ఈ క్రమంలోనే నేను ఒంటి చేత్తో రెండు సిక్స్‌లు బాదాను. ఆ సిక్సులు కొట్టడం నాకు ఇంకా గుర్తుంది' అని రిషబ్ పంత్‌ గుర్తు చేసుకున్నాడు.

'పాక్‌తో మ్యాచ్ అంటే ఎప్పుడూ ప్రత్యేకమే. ఇండో-పాక్ మ్యాచుకు ఎంతో హైప్‌ ఉంటుంది. అది భావోద్వేగాలతో కూడుకున్న మ్యాచ్‌. ప్లేయర్స్, అభిమానులు మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ ఎంతో ఉద్వేగంతో చూస్తారు. అదో విభిన్న అనుభూతి. మైదానంలోకి అడుగుపెట్టగానే అభిమానుల అరుపులు మరో స్థాయిలో ఉంటాయి' అని టీమిండియా వికెట్ కీపర్ చెప్పుకొచ్చాడు.  

Also Read: ఆహా అనిపిస్తున్న 'అప్సర రాణి' అందాలు.. ఆర్జీవీ హీరోయిన్‌ను బికినీలో చూస్తే మతి పోవాల్సిందే!

Also Read: CM Jagan Mohan Reddy: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ మాస్ కౌంటర్.. ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏంటి..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News