IND vs PAK: భార‌త్, పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్‌ సమరం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్!

Pakistan Women have won the toss and have opted to bat. మ‌హిళ‌ల టీ20 ప్రపంచక‌ప్‌లో భాగంగా జరగనున్న ఈ గెలిచిన పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్ బ్యాటింగ్ ఎంచుకుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 12, 2023, 08:47 PM IST
  • భార‌త్, పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్‌ సమరం
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
  • గాయం కారణంగా మంధాన మ్యాచ్‌కు దూరం
IND vs PAK: భార‌త్, పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్‌ సమరం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్!

Pakistan Women opt to bat vs India Women: కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో దాయాదులు భార‌త్, పాకిస్థాన్ జట్లు మరోకొద్ది సేపట్లో తలపడనున్నాయి. మ‌హిళ‌ల టీ20 ప్రపంచక‌ప్‌లో భాగంగా జరగనున్న ఈ గెలిచిన పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇది పొడి వికెట్ అని, భారీ స్కోర్ చేయాలనుకుంటున్నామని బిస్మా పేర్కొంది. చివరగా భారత్‌పై గెలిచినందున ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నామని తెలిపింది. కీలక మ్యాచ్ కాబట్టి భార‌త్, పాకిస్థాన్ హోరాహోరీగా త‌ల‌ప‌డ‌నున్నాయి. 

ఈ మ్యాచులో భారత్‌ ఫేవరెట్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన వేలి గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయింది. ఇది భారత జట్టుకు పెద్ద దెబ్బే. మంధాన లేకపోవడంతో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్‌, జెమీమా రోడ్రిగస్‌ బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు.

ఇప్పటివరకూ టీ20 ప్రపంచకప్‌ల్లో పాకిస్థాన్‌తో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో భారత్‌ 4 విజయాలు సాధించింది. 2 మ్యాచుల్లో మాత్రమే పాక్‌ గెలిచింది. మొత్తంగా టీ20ల్లో రెండు జట్లు 13 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్‌ 10 గెలవగా.. పాకిస్తాన్ 3 మ్యాచ్‌ల్లో గెలిచింది. 

తుది జట్లు:
భారత్: షెఫాలీ వర్మ, యస్తికా భాటియా, జెమీమా రోడ్రిగస్‌, హర్లీన్‌ డియోల్, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), రిచా ఘోష్‌, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్‌, రాధా యాదవ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, రేణుకా ఠాకూర్‌ సింగ్‌.
పాకిస్తాన్: జావేరియా ఖాన్‌, మునీబా అలీ, బిస్మా మరుఫ్‌ (కెప్టెన్‌), నిదా దర్‌, సిద్రా అమీన్‌, అలీయా రియాజ్‌, అయేషా నసీమ్‌, ఫాతిమా సనా, ఐమన్‌ అన్వర్‌, నశ్రు సంధు, సదియా ఇక్బాల్‌. 

Also Read: Meta Layoffs 2023: మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. ఇప్పటికే 11 వేల మంది!  

Also Read: Upcoming Cars In India: భారత మార్కెట్‌లోని 3 పురాతన కార్లు.. బుకింగ్ కూడా మొదలైంది! ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అంబాసిడర్‌  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x