IND vs SA 2nd ODI Live updates: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. సఫారీ బౌలర్లు ధాటికి భారత్ 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (83 బంతుల్లో 62, 7 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ కెఎల్ రాహుల్ (64 బంతుల్లో 56, 7 ఫోర్లు) మినహా మిగిలినవారందూరు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. సఫారీ పేసర్లలో నండ్రె బర్గర్ మూడు కీలక వికెట్లు తీసి భారత జట్టును దెబ్బకొట్టాడు. కేశవ మహరాజ్, హెనిడ్రిక్స్ చెరో రెండు వికెట్లు తీశారు.
గబెరా వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది సౌతాఫ్రికా. ఓపెనర్ గా వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. ఫస్ట్ డౌన్ వచ్చిన తిలక్ వర్మ కూడా పది పరుగులే చేసి వెనుదిరిగాడు. 46పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాను కెప్టెన్ రాహుల్, సాయి జోడి ఆదుకుంది. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా స్కోరుబోర్డును పరుగులెత్తించారు. మూడో వికెట్ కు 68 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు.
Also Read: Mitchell Starc: ఐపీఎల్ ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్, 24.75 కోట్లకు కొనుగోలు
114 పరుగుల వద్ద భారత్ సాయి వికెట్ ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన శాంసన్ కూడా 12 పరుగుల చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత వరుసగా రాహుల్, రింకూ వికెట్లను కోల్పోయింది భారత్. తొలి వన్డే ఆడుతున్న రింకూ సింగ్ కేవలం 17 పరుగులు మాత్రమే చేశాడు. అర్షదీప్ మినహా చివరి బ్యాటర్లు ఎవరూ ఆడకపోవడంతో టీమిండియా 211 పరుగులకు ఆలౌటైంది.
Also Read: వేలంలో కోట్లు కొల్లగొట్టిన అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు.. సమీర్, దూబేలకు రికార్డు ధర..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook