Ind vs SA: భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ ముగిసింది. మొదటిది వర్షార్పణం కాగా రెండవ టీ20 దక్షిణాఫ్రికా, మూడవది ఇండియా గెలవడంతో సిరీస్ 1-1తో సమమైంది. సూర్య కుమార్ నేతృత్వంలోని టీమ్ ఇండియాకు రెండవ విజయంగా చెప్పవచ్చు.
జోహాన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్డేడియంలో ఇండియా-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ 1-1తో సమమైంది. ఆస్ట్రేలియాతో స్వదేశంపై టీ20 సిరీస్‌ను 4-1తో చేజిక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్ సారధ్యంలోని టీమ్ ఇండియా హుషారుగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దయితే రెండవ టీ20లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఇక నిన్న జరిగిన చివరి టీ20లో భారత్ ఘన విజయం సాధించడంతో సిరీస్ 1-1తో సమమైంది.
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభమన్ గిల్, తిలక్ వర్మలు ప్రారంభంలోనే వికెట్లు పోగొట్టుకున్నారు. ఆ తరువాత యశస్వి జైశ్వాల్, సూర్యుకుమార్ యాదవ్ భారత్ ఇన్నింగ్స్ నిలబెట్టారు. యశస్వి 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయగా సూర్యకుమార్ యాదవ్ 55 బంతుల్లోనే అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేశాడు. రింకూ సింగ్ ప్రభావం కన్పించలేదు. జితేష్, జడేజాలు విఫలమయ్యారు.
అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఇండియా 106 పరుగుల తేడాతో విజయం నమోదు చేసి సిరీస్ సమం చేయగలిగింది. దక్షిణాఫ్రికా జట్టులో డేవిడ్ మిల్లర్ 35, ఐడెన్ మార్క్‌రమ్ 25, డోనోవన్ ఫెరీరా 12 పరుగులు మాత్రమే చెప్పుకోదగ్గ డబుల్ డిజిట్ స్కోర్లు. టీమ్ ఇండియా నుంచి కుల్దీప్ యాదవ్ అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీశాడు.
Also read: Suryakumar Yadav: ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా.. సూర్య కుమార్ సూపర్ సెంచరీ.. భారత్ భారీ స్కోరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Ind vs SA: చివరి టీ20లో ఇండియా ఘన విజయం, దక్షిణాఫ్రికాతో సిరీస్ 1-1తో సమం