Suryakumar Yadav: ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా.. సూర్య కుమార్ సూపర్ సెంచరీ.. భారత్ భారీ స్కోరు

Suryakumar Yadav Century: సౌతాఫ్రికాపై టీమిండియా భారీ స్కోరు చేసింది. సూర్యకుమార్ యాదవ్ రికార్డు సెంచరీతో సఫారీ బౌలర్లను ఊచకోత కోశాడు. వాండరర్స్ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించడంతో భారత్ 20 ఓవర్లో 201 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (60) అర్ధ సెంచరీతో రాణించాడు.  

Written by - Ashok Krindinti | Last Updated : Dec 14, 2023, 11:29 PM IST
Suryakumar Yadav: ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా.. సూర్య కుమార్ సూపర్ సెంచరీ.. భారత్ భారీ స్కోరు

Suryakumar Yadav Century: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో,  చివరి టీ20లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు. టీ20 ఫార్మాట్‌లో నాల్గో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్‌గా సూర్యకు ఇది తొలి శతకం. ఈ సెంచరీతో టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో రోహిత్ శర్మ, మ్యాక్స్‌వెల్(4) సరసన చేరాడు సూర్య. సూర్యకుమార్ 57 ఇన్నింగ్స్‌లలో నాలుగు సెంచరీలు సాధించగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 79 టీ20 ఇన్నింగ్స్‌లో నాలుగు శతకాలు బాదాడు. ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ 92 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో జరుగుతు సిరీస్ డిసైడర్‌ మ్యాచ్‌లో సూర్యకుమార్ సెంచరీకి తోడు యశస్వి జైస్వాల్ (60) చెలరేగడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. 202 రన్స్ లక్ష్యంతో సౌతాఫ్రికా బరిలోకి దిగనుంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలో షాక్ తగిలింది. శుభ్‌మన్ గిల్ (12), తిలక్ వర్మ (0) వరుస బంతుల్లో ఔట్ అయ్యారు. కేశవ్ మహారాజ్ వీరిద్దరిని పెవిలియన్‌కు పంపించాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఇద్దరు బౌండరీల వర్షం కురిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.  14 ఓవర్‌లో 141 పరుగుల వద్ద జైశ్వాల్ (41 బంతుల్లో 60, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔట్ అయ్యాడు.

రింకూ సింగ్ (14), జితేశ్ శర్మ (4), రవీంద్ర జడేజా (4) తక్కువ స్కోర్లకే ఔట్ అయినా.. మరో ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. 55 బంతుల్లోనే శతకం బాదాడు. మొదట 25 బంతుల్లో 27 పరుగులు చేసిన SKY.. తరువాత తాను ఎదుర్కొన్న 31 బంతుల్లో 73 రన్స్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 56 బంతుల్లో 100 (7 ఫోర్లు, 8 సిక్సర్లు) పరుగులు చేసి ఔట్ అయ్యాడు. చివరకు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, విలియమ్స్ చెరో రెండు వికెట్లు తీయగా.. బర్గర్, షంసీ తలో వికెట్ పడగొట్టారు. 

Also Read: Haj Yatra 2024: హజ్ యాత్రికులకు ముఖ్య గమనిక.. రిజిస్ట్రేషన్‌కు ఆ రోజే లాస్ట్

Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News