IND vs SL, Kapil Dev Heap Praise On Suryakumar Yadav: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసలు కురిపించారు. సూర్య లాంటి ప్లేయర్ వందేళ్లకు ఓసారి మాత్రమే వస్తారన్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ, విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ సరసన నిలిచే బ్యాటర్ సూర్య అని పేర్కొన్నారు. సూర్యకుమార్ ప్రస్తుతం టాప్ ఫామ్‌లో ఉన్నాడు. టీ20ల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 51 బంతుల్లోనే 112 పరుగులు చేశాడు. టీ20 ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం సూర్య అగ్రస్థానంలో ఉన్నాడు.
కపిల్ దేవ్ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ని వర్ణించాలంటే నాకు మాటలు రావడం లేదు. ఒకటి మాత్రం చెప్పగలను. ఏదో ఒక రోజు సూర్య కూడా సచిన్ టెండ్యూలర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల సరసన చేరుతాడేమోనని నాకు అనిపిస్తోంది. సూర్య ఫైన్ లెగ్ మీదుగా ఆడే ల్యాప్‌షాట్ ఎలాంటి బౌలర్‌ను అయినా భయపెడుతుంది. సూర్యకుమార్ నిలబడి మిడ్ ఆన్, మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ కొట్టగలడు. బౌలర్ ఎటువంటి బంతి వేస్తాడో కచ్చితంగా ముందే అంచనా వేస్తాడు' అని అన్నారు.
'ఏబీ డివిలియర్స్, వివియన్ రిచర్డ్స్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్ వంటి గొప్ప గొప్ప బ్యాటర్లను చూశాను. కానీ కొందరు మాత్రమే సూర్యకుమార్ యాదవ్‌లా బంతిని క్లీన్‌గా కొట్టగలరు. హ్యాట్సాఫ్ యూ సూర్యకుమార్ యాదవ్. సూర్య లాంటి ఆటగాళ్లను వందేళ్లకు ఒకసారి మాత్రమే చూస్తాం' అని కపిల్ దేవ్ అన్నారు. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 26 బంతుల్లో 50 రన్స్ చేసిన సూర్య.. 51 బంతుల్లో 112 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో సూర్య శతకం బాదేశాడు.
ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ జట్టు తరపున 2-3 సంవత్సరాలు అద్భుతంగా ఆడిన సూర్యకుమార్ యాదవ్.. 2021లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 2022లో 1000కి పైగా పరుగులు చేసి ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అందుకొన్న సూర్య.. తాజాగా 1500 పరుగుల మైలు రాయిని దాటేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 1500 రన్స్ అందుకొన్న ఏకైక బ్యాటర్ సూర్యనే. సూర్య భారత్ తరఫున టీ20, వన్డేలలో ఆడుతున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.