జయహో భారత్.. ఆసియా కప్ మనదే..!

    

Last Updated : Oct 22, 2017, 07:50 PM IST
జయహో భారత్.. ఆసియా కప్ మనదే..!

10 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు భారత హాకీ టీమ్ ఆసియా కప్ కైవసం చేసుకుంది. ఒక చరిత్రనే తిరగరాసింది.

ఫైనల్‌లో మలేసియాపై 2-1 గోల్స్‌ తేడాతో విజయం సాధించిన భారత్ టీమ్ ఇప్పుడు సంబరాలు చేసుకుంటోంది. ఆసియా కప్ చరిత్రలో భారత్‌కు ఇది మూడవ విజయం. సూపర్ 4లో చిరకాల ప్రత్యర్థి  పాకిస్తాన్‌ను 4-0తో చిత్తు చేసిన భారత్, ఫైనల్స్‌లో కూడా దూసుకుపోయింది.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొదటి నుంచీ దూకుడు ప్రదర్శిస్తూ.. ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రమణ్‌దీప్ సింగ్ తొలి గోల్ చేయగా, 29వ నిముషంలో లలిత్ ఉపాధ్యాయ మరో గోల్ సాధించి గేమ్ తీరునే మార్చేశాడు.

చివరి నిముషాల్లో మలేషియా కొంత ప్రతిఘటించినప్పటికీ.. ఎదురుదాడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ సమయం లేకపోవడంతో భారత్ శిబిరంలో సంతోషం వెల్లివిరిసింది. ఇప్పటికి భారత్ ఏడుసార్లు ఆసియా కప్ ఫైనల్‌కి చేరింది. 

Trending News